కేటీఆర్ జిల్లాల పర్యటనపై కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్.. ముందు ఆ పని చేయాలంటూ!

-

కేటీఆర్ జిల్లాల పర్యటనపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అయ్యింది. ముందుగా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకోవాలని, చివరి దశలో ఉన్న ఆయన పార్టీని ముందుగా కాపాడుకోవాలని సూచించింది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా కేటీఆర్ జిల్లాల పర్యటన చేస్తారని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. పర్యటనలో భాగంగా కేటీఆర్ నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారని, దీనికి సంబంధించిన షెడ్యూల్‌ని కూడా పోస్ట్ చేసింది.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ స్పందిస్తూ..కేటీఆర్ పర్యటనపై కౌంటర్ ఇచ్చింది.బీఆర్ఎస్ పార్టీ నేతలు అసెంబ్లీలోనూ నిలబడలేని పరిస్థితి వచ్చిందంటే ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్మాలి? అని ప్రశ్నించింది.సిల్వర్ జూబ్లీ కాదు.. ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన పార్టీ చివరి దశకి చేరుకుంటోందని, ముందు మీ పార్టీని కాపాడుకోండి అని సలహా ఇచ్చింది.తెలంగాణ ప్రజలు మీ పర్యటనలకు కాక,కొత్త ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న పనులపై ఆసక్తి చూపిస్తున్నారని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version