ఈ పండును తీసుకుంటే షుగర్ తగ్గడమే కాదు.. ఎన్నో లాభాలను పొందవచ్చు..!

-

చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు పండ్లను తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశాలు ఉంటాయి అని భయపడతారు. అయితే స్టార్ ఫ్రూట్ ను తినడం వలన డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా మంది ఇంటి వద్ద కూడా ఈ మొక్కలు తెచ్చుకొని పెంచుతున్నారు. ఎలా అయితే జామకాయ రుచి ఉంటుందో అదే విధంగా స్టార్ ఫ్రూట్ కూడా ఉంటుంది. కాకపోతే అంత తియ్యగా ఉండవు, కొంచెం పుల్లగా ఉంటాయి. ఈ పండ్లను తీసుకోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.

స్టార్ ఫ్రూట్ లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో స్టార్ ఫ్రూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇందులో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. ఎక్కువగా ఇవి పచ్చ రంగులో ఉంటాయి. వీటిని దక్షిణ పసిఫిక్, తూర్పు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లోని పండించడం జరుగుతుంది. ఈ పండ్లలో విటమిన్ సి, బి2, బి9, బి6, జింక్, ఐరన్ పొటాషియం, క్యాల్షియం, కాపర్, ఫోలేట్, మెగ్నీషియం వంటి మొదలైన పోషకాలు లభిస్తాయి. వీటిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం ఉంటుంది.

స్టార్ ఫ్రూట్ లో ఫైబర్ మరియు ఆంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దీంతో జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను కూడా తొలగించుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండాలంటే వీటిని తప్పకుండా తీసుకోండి. స్టార్ ఫ్రూట్ తో డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి మాత్రమే కాకుండా వెయిట్ లాస్ అవ్వడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడానికి కూడా తీసుకోవచ్చు. ఇటువంటి ఎన్నో ఉపయోగాలను మీరు పొందాలి అని అనుకుంటే తప్పకుండా స్టార్ ఫ్రూట్ ని తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news