రికవరీ అయిపోయిన తర్వాత ఫిట్ గా ఉండాలంటే కాస్త వ్యాయామం చేయాలి. కొన్ని ఎక్సర్సైజులు పాటించడం వల్ల మీరు ఫిట్ గా ఉంటారు మరియు ఆరోగ్యంగా ఉంటారు. మరి ఆ వ్యాయామాల గురించి చూద్దాం..!
ప్రోనింగ్:
మీరు ప్రోనింగ్ పొజిషన్ లో ఉండడం వల్ల ఆక్సిజన్ బాగా అందుతుంది. తలా కింద, చేతులు కింద ఇలా అవసరం అయితే దిండ్లు పెట్టుకుని ఈ పొజిషన్ లో అరగంట నుండి రెండు గంటల పాటు ఉండండి.
ప్రాణాయామం:
ప్రాణాయామం కూడా శ్వాస తీసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి మీ సమయాన్ని కాస్త ప్రాణాయామానికి కేటాయించండి.
బెలూన్ ఎక్సరసైజ్:
మీరు కొన్ని బెలూన్స్ తీసుకుని వాటిని ఊదడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. మీరు బెలూన్స్ ను ఊదితే ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుంచి తీసుకోడానికి వీలవుతుంది. ఎప్పుడైతే మీరు ఇలా చేస్తూ ఉంటారో అప్పుడు మీ శ్వాస బాగుంటుంది.
హై సైడ్ లీన్:
ఇక్కడ మీరు సపోర్ట్ తీసుకుని తల కింద మరియు నెక్ కింద కూడా మీరు దిండ్లు పేర్చుకుని ఒక పక్కకి మీరు వంగాలి.
ఫార్వర్డ్ లీన్ సిట్టింగ్:
ఇందులో మీరు ముందుకి ఒంగి కూర్చోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కూడా మీకు మంచి లాభం ఉంటుంది.
ఫార్వర్డ్ లీన్ సిట్టింగ్:
కుర్చీలో కూర్చుని ముందుకి వంగి మీ ఒళ్ళో మీ చేతుల్లో ఉంచుకోండి.
ఫార్వర్డ్ లీన్ స్టాండింగ్:
నించునేటప్పుడు ముందుకి ఒంగి కిటికీల దగ్గర కానీ లేదా ఏదైనా గోడ సపోర్ట్ కానీ తీసుకోండి.
స్టాండింగ్ విత్ బ్యాక్ సపోర్ట్:
వెనక్కి ఒంగి గోడ సపోర్ట్ తీసుకుని కాసేపు ఈ పొజిషన్ లో ఉండండి.
రిలాక్స్:
ఎక్కువగా రిలాక్స్ అవ్వడం వల్ల కూడా మంచిదే రిలాక్స్ అయితే మీ బ్లడ్ లో ఆక్సిజన్ ఇంక్రీజ్ అవుతుంది. అదే విధంగా అది మిమ్మల్ని శాంతి పరుస్తుంది మరియు పాజిటివ్ థింకింగ్, ఏకాగ్రత, మెమరీ మరియు ఆలోచన పెంచడానికి ఉపయోగపడుతుంది. మీకు సరిగ్గా శ్వాస లేకపోయినా దగ్గు లేదా ఏమైనా సమస్యలు ఉంటే ఇలా మీ సమయాన్ని ఈ వ్యాయామాలతో కేటాయించండి దీనితో మీకు మంచి ప్రయోజనం ఉంటుంది.