వాటే పాలసీ… రూ.3,500తో రూ.26 లక్షలు!

-

మీరు మంచి పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఒక అదిరిపోయే పాలసీ ఉంది. దీనితో మీరు మంచి బెనిఫిట్స్ ని పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఎల్‌ఐసీ లో న్యూ చిల్ట్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ అని ఒకటి వుంది. పిల్లల భవిష్యత్‌కు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ పాలసీ బాగా ఉపయోగ పడుతుంది.

పుట్టిన పిల్లల దగ్గరి నుంచి 12 ఏళ్ల వయసులోపు ఉన్న పిల్లల కోసం ఈ పాలసీ తీసుకోవచ్చు. మీరు రూ.10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే నెలకు రూ.3,500 ప్రీమియం పడుతుంది. ఎల్‌ఐసీ న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ పాలసీని పిల్లలు పుట్టగానే చాల మంది తీసుకుంటారు.

దీనితో పిల్లలకు 18 ఏళ్లు వచ్చినప్పుడు 20 శాతం డబ్బులు వస్తాయి. అలాగే 20 ఏళ్లు, 22 ఏళ్లు, వచ్చినప్పుడు కూడా 20 శాతం డబ్బులు లభిస్తాయి. ఇది ఇలా ఉంటే… ఈ పాలసీ మెచ్యూరిటీ సమయంలో మిగతా 40 శాతం డబ్బులు వస్తాయి.

ఇంకా బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ వంటివి కూడా ఉంటాయి. దీనిలో కనుక మీరు రూ.10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే.. 18 ఏళ్లలో రూ.2 లక్షలు, 20 ఏళ్లలో రూ.2 లక్షలు, 22 ఏళ్లలో రూ.2 లక్షలు, 25 ఏళ్లలో రూ.20 లక్షలు వస్తాయి.ఇలా ఈ పాలసీ తో ఏకంగా రూ.26 లక్షలు లభిస్తాయి. పిల్లలు పుట్టిన తొలి ఏడాదే పాలసీ తీసుకుంటే ప్రీమియం తగ్గుతుంది అలానే మంచి లాభాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version