ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాని వలన ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా శరీరంలో వేడి కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందో వడదెబ్బ, అలసట వంటి సమస్యలు పెరిగిపోతాయి. కనుక సరైన విధంగా మంచి నీటిని తీసుకుని హైడ్రాటెడ్ గా ఉండాలి. ఎప్పుడైతే ఎండలు ఎక్కువగా ఉంటాయో, శరీరంలో వేడి తగ్గించుకోవడం కష్టమవుతుంది. కేవలం మంచినీరు మాత్రమే కాకుండా ఎలక్ట్రోలైట్లను కూడా శరీరానికి అందించాలి. ఇటువంటి పానీయాలను తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఎండాకాలంలో కొబ్బరినీరు, నిమ్మకాయ నీరు వంటివి తప్పకుండా తీసుకోవాలి. ఎండలో తిరగకపోయినా సరే ప్రతిరోజు మజ్జిగను కూడా తీసుకోవడం ఎంతో అవసరం. ఎప్పుడైతే మజ్జిగతో పాటుగా పుదీనా, నిమ్మరసం, ఉప్పు వంటివి తీసుకుంటారో శరీరంలో వేడి తగ్గుతుంది మరియు ఎంతో శక్తిని కూడా పొందవచ్చు. చాలా మంది శరీరంలో వేడి ఎక్కువ అవడం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మణికట్టు, మెడ, నుదురు, పాదాలు వేడిగా ఉన్నప్పుడు కోల్డ్ బ్యాండేజ్ ను లేదా ఐస్ ప్యాక్ ను ఉపయోగించవచ్చు. ఇలా చేస్తే వెంటనే శరీరం నుండి వేడి తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి హైడ్రేషన్ ఎంత అవసరమో చల్లటి నీటితో స్నానం చేయడం కూడా అంతే అవసరం.
ఎప్పుడైతే చల్లటి నీటితో స్నానం చేస్తారో శరీరంలో వేడి తగ్గిపోతుంది. కనుక ప్రతిరోజు వేసవికాలంలో రోజుకు రెండుసార్లు చల్లటి నీటితో స్నానం చేస్తే మేలు. వేసవికాలంలో విశ్రాంతి తీసుకోవడం ఎంతో అవసరం. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వలన శరీరం పై ఎంతో ప్రభావం పడుతుంది. కనుక చల్లని ప్రదేశాల్లో ఉండడం, సూర్యరశ్మికి గురి అవకుండా ఉండడం వంటివి చేయాలి. ఉష్ణోగ్రతను తగ్గించడానికి మంచి నీరు మరియు ఇతర పానీయాలు ఎంత మేలు చేస్తాయో కాఫీ వంటి పానీయాలు తీసుకుంటే అంతే ప్రమాదం. పైగా కాఫీ లేక చక్కెర ఉపయోగించిన పానీయాలను తీసుకోవడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు మరియు ఆరోగ్యం మీద కూడా ప్రభావం ఉంటుంది. కనుక ఇటువంటి మార్పులను చేసుకుని వేసవికాలంలో హైడ్రేటెడ్‌గా ఉండాలి.