హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై నా అన్వేషణ యూట్యూబర్,ప్రపంచయాత్రికుడు అన్వేష్ స్పందించారు. గురువారం ఉదయం ఓ వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు.వీడియో సందేశంలో ఆయన ఏమన్నారంటే.. ‘తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నది కరెక్ట్. 400 ఎకరాల ద్వారా.. ప్రజల కోసం రూ.50 వేల కోట్ల సంపదను రేవంత్ రెడ్డి సృష్టిస్తున్నారు.
తెలంగాణ ప్రజల కోసం,తెలంగాణ భవిష్యత్తు కోసం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ డబ్బుతో తెలంగాణ అభివృద్ధి చెందుతుంది’ నా అన్వేష్ తెలిపారు. కాగా, హెచ్‌సీయూలో అటవీని తొలగించవద్దని.. వన్యప్రాణుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని విద్యార్థులు, ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.
HCU వివాదం.. రేవంత్ రెడ్డి చేస్తున్నది కరెక్ట్: అన్వేష్
HCU వివాదంపై యూట్యూబర్ అన్వేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నది కరెక్ట్. 400 ఎకరాల ద్వారా.. ప్రజల కోసం రూ. 50 వేల కోట్ల సంపదను రేవంత్ రెడ్డి సృష్టిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల… pic.twitter.com/88EG4cPSSG
— ChotaNews App (@ChotaNewsApp) April 3, 2025