బరువు తగ్గడం అనేది సులువైన ప్రక్రియ కాదు. అయితే ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే అప్పుడు మంచి డైట్ మరియు ప్రతి రోజూ తప్పకుండా వ్యాయామాలు చేయాలి. మీ బరువును మరింత త్వరగా తగ్గాలని అనుకున్నప్పుడు తిప్పతీగను మీ డైట్ లో భాగంగా చేర్చుకోండి. తిప్పతీగలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. తిప్పతీగ వలన కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడు చూద్దాం.
ఇమ్యూనిటీని పెంచచ్చు:
తిప్పతీగ లో అత్యధిక శాతం యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దాంతో రోగ నిరోధక బాగుంటుంది. అంతే కాదు శరీరంలో ఉండే కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు రక్తంని శుద్ధిచేస్తుంది. లివర్ మరియు యూరినరీ ట్రాక్ కు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ని కూడా అదుపు చేస్తుంది. మరీ ముఖ్యంగా బ్లడ్ లో ఉండే షుగర్ శాతాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది.
అజీర్తి సమస్య ఉండదు:
తిప్పతీగను తీసుకోవడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. యాసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. తిప్పతీగ మరియు ఉసిరిను జ్యూస్ రూపంలో తీసుకుంటే మీ జీర్ణ ప్రక్రియను ఎంతో మెరుగుపడుతుంది మరియు గట్ ఆరోగ్యం బాగుంటుంది.
ఒత్తిడి తగ్గుతుంది:
ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఒత్తిడికి గురవుతున్నారు. అలాంటివారు తప్పకుండా తిప్పతీగను తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం, మెమరీ, ఫోకస్ పెరుగుతుంది.
తిప్పతీగ వల్ల ఏ విధంగా బరువు తగ్గవచ్చు…?
తిప్పతీగను అలొవేరా మరియు శిలాజిత్ తో కలిపి తీసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణప్రక్రియ బాగా జరిగి బరువు తగ్గేలా చేస్తుంది. బరువు తగ్గడం కోసం ప్రతిరోజు ఉదయాన్నే కొద్దిగా తిప్పతీగ రసం తీసుకుని దానిలో తేనె కలుపుకొని తాగండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.