గరుడముక్క మొక్క.. చూసే ఉంటారు కానీ.. ఉపయోగాలు తెలియక పక్కనపెట్టేశారా..!

-

ప్రకృతిలో మనిషికి తెలియని ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. మనకంటికి పిచ్చిమొక్కల్లా కనిపించే ఎన్నో మొక్కల్లో దీర్ఘకాలిక రోగాలను నయం చేయగలిగే శక్తి ఉంటుంది. వాటిని మనం గుర్తించలేకపోతున్నాం. అలా అని కనిపించిన ప్రతీది మంచిది కాదు. కొన్ని మొక్కలు టచ్‌ చేస్తేనే ప్రాణాలమీదకు వస్తుంది. ప్రకృతి మానవాళికి అందించిన ఒక అద్భుతమైన మొక్క గురడ ముక్కు. దీనిలో అనేక ఔషధగుణాలు ఉన్నాయి. దీని విత్తనాలు గ్రద్ధ ముక్కు ఆకారంలో, కాండం రెండు చేతులు కలిసినట్లుగా ఉంటాయి. ఈరోజు ఈ మొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం.!

దక్షిణ భారత దేశంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కనిపించే ఈ మొక్కను గిరిజనలు అనేక రకాలుగా వాడతారు.. వాళ్లకు నచ్చినట్లు పిలుచుకుంటారు. ఈ మొక్కను సంస్కృతంలో కాకంగి, కకనస అని.. సాధారణంగా ఈ చెట్టును గరుడ ముక్కు చెట్టు, గద్దాకు చెట్టు, తేలు కొండకు, తేలు కొండి చెట్టు, గొఱ్ఱె జిడ్డాకు వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు. మధ్యప్రదేశ్ ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఈ మొక్క కాండాన్ని తాంత్రిక, వశీకరణ చర్యలకు ఉపయోగిస్తారు. ఈ చెట్టు ఆకులు రాత్రిపూట ఆకాశం వైపు చూస్తున్నట్లు ఉంటాయి. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ చెట్టులో అద్భుత రహస్యాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

మొక్క వల్ల ఉపయోగాలు..

చర్మం దురదలకు, చర్మవ్యాధులకు ఈ నూనె మంచి ఔషధం.
మూర్ఛ వ్యాధి రోగులకు గరుడ ముక్కకు మొక్క ఆకుల రసం అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ మొక్కల ఆకుల రసం నిద్రలేమికి.. క్షయ నివారణకు ఉపయోగిస్తారు.
ఈ మొక్క ఆకుల ర‌సాన్ని మెడ‌కు రాయ‌డం వ‌ల్ల క్ష‌య వ్యాధి త‌గ్గు ముఖం ప‌డుతుంది.
కీళ్ల నొప్పులు, త‌ల‌నొప్పి, ఛాతి నొప్పి వ్యాధుల నివారణ కోసం.. ఈ మొక్క వేర్ల‌ ఉపయోగించవచ్చు.
ఈ విత్తనాల నుంచి తీసిన నూనెను తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది.
యాంటీ వైపరిన్ లక్షణాల కారణంగా సాలెపురుగు , విష పురుగుల విషానికి విరుగుడుగా ఉపయోగిస్తారు.
కాలిన గాయాలు త్వరగా తగ్గాలంటే.. పండ్లను కాల్చిన బూడిద, కొబ్బరి నూనెతో కలిపి ఆ మిశ్రమాన్ని కాలిన గాయాలపై అప్లై చేయాలి.
తేలు విషాన్ని హ‌రించ‌డంలో ఈ ఆకుల రసం దివ్య ఔషధం. తేలు కరిచిన చోట ఈ ఆకుల రసాన్ని వేసి కట్టుకడితే.. వెంటనే ఉపశమనం కలుగుతుంది.
వేర్లను ఎండ‌బెట్టి పొడిగా చేసుకోవాలి. ఒక టీ స్పూన్ పొడిని ఒక గాజు గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా ఉంచాలి. ఈ నీటిని ఉదయమే తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

నిపుణులు ఇచ్చిన సమాచారం మేరకే ఈ కథనం మీకు అందించడం జరిగింది. మనలోకం సొంతంగా రాసింది కాదని గమనించగలరు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version