అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వంటలకే కాదు..ఈ రోగాలకు మెడిసిన్‌ కూడా..!!

-

అల్లం వెల్లుల్లి పేస్ట్‌ లేకుండా మసాలా వంటలు చేయలేం.. ఒకవేళ చేసినా ఇవి లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. రెండు చెంచాల అల్లం వెల్లుల్లిపేస్ట్‌ వేసి ఏ నాన్‌వెజ్‌ వంట అయినా చేయండి..ఆ స్మెల్‌కే ఆకలి వేయడం స్టాట్‌ అవుతుంది.. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వంటల్లో మాత్రమే అది కూడా మసాల వంటల్లో మాత్రమే వాడతారని మనకు తెలుసు.. కానీ ఈ పేస్ట్‌ ఒక మెడిసిన్‌గా కూడా పనిచేస్తుందని మీకు తెలుసా..? వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అనేక వ్యాధులని నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అనారోగ్యాలు దరి చేరకుండా రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని రక్షించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

అల్లం, వెల్లుల్లి రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు. LDL కొలెస్ట్రాల్ స్థాయిలను 10-15 శాతం వరకు తగ్గిస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.

మధుమేహం..

డయబెటీస్‌ ఉన్నవారు.. వెల్లులిని తమ ఆహారంలో భాగం చేసుకుంటే చాలా మేలు చేస్తుంది. అల్లం, వెల్లుల్లి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీర్ఘకాలికంగా రక్తంలో చక్కెరను గుర్తించే అణువు హిమోగ్లోబిన్ A1c (HbA1c) స్థాయిలను తగ్గించడానికి కూడా పని చేస్తాయి. ప్రతి రోజు ఉదయం వేడి వేడి అన్నంలో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కాసేపు ఉంచుకొని తర్వాత వాటిని తింటే మధుమేహులకి చాలా మేలు చేస్తుందట…

జ్ఞాపకశక్తికి

జ్ఞాపకశక్తిని పెంచడంలో మెరుగ్గా పని చేస్తాయి. అభిజ్ఞా క్షీణతను నిరోధించడంలో సహాయపడే నరాల కణాలను కాపాడేందుకు సహకరిస్తాయి

అల్లం వెల్లుల్లి సూప్

ఈ రెండింటితో కలిపి సూప్ చేసుకుని తాగితే అన్నీ రోగాలకు ఔషధంగా పని చేస్తుంది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్ళు దీని తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. మహిళలు వారానికి ఒక సారైనా ఈ సూప్ తాగితే నెలసరి సమయంలో ఎలాంటి నొప్పులు రావు.

బరువు తగ్గేందుకు

వెల్లుల్లిలో సల్ఫర్ గుణాలు అధికంగా ఉన్నాయి. బరువు తగ్గేందుకు బాగా పని చేస్తాయి. వెల్లుల్లి నీళ్ళు తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. ఫలితంగా బరువు తగ్గొచ్చు.అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధులతో పోరాడేందుకు సమర్థవంతంగా పని చేస్తాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి6లు రోగనిరోధక శక్తిని పెంచి, సీజన్ వ్యాధులను తట్టుకునే శక్తిని ఇస్తాయి.

రోగనిరోధక శక్తి ..

ఈ పేస్ట్‌లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయి. వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version