పరీక్షల ముందు లేదా ముఖ్యమైన ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు, మీ చేతులు వణకటం గమనించారా? ఐతే అప్పుడు టెన్షన్ వల్లనే అని అనుకోవడం సర్వసాధారణం. కానీ మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నా సరే ఒక్కోసారి చేతులు వణకటం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? ఈ వణుకు అనేది కేవలం ఒత్తిడి కి సంబంధించిన లక్షణం కాకపోవచ్చు, దాని వెనక ఇతర కారణాలు కూడా దాగి ఉండవచ్చు, మరి యువతలో చేతులు వణకటం గల వివిధ కారణాలు లోతుగా పరిశీలిద్దాం.. మీరు ఈ సమస్యను ఎదుర్కొన్నట్లయితే ఇది మీకు సరైన అవగాహన ఇస్తుంది.
ఎక్కువగా వయసు పైబడిన వారిలో ఈ సమస్యను మనం చూస్తూ ఉంటాం. పెద్దవారైన తర్వాత శరీరం అలసట చెంది చేతులు వెనకడం మనం గమనిస్తాం. కానీ ఈ రోజుల్లో ఎక్కువ మంది యువత కూడా చేతులు వణుకు లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి అలా ఎందుకు కారణమవుతుందనేది ఎప్పుడైనా ఆలోచించారా? వణుకు రావడానికి గల ముఖ్య కారణాలు చూద్దాం..
ఒత్తిడి మరియు ఆందోళన: సహజంగా ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆందోళన చెందినప్పుడు మన శరీరంలో అడ్రినలిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది హృదయ స్పందన రేటును పెంచుతుంది తద్వారా చేతులు వణకటం కు కారణం అవుతుంది.
అవసరమైన వణుకు : ఇది సాధారణంగా వంశపారపర్యంగా వచ్చే ఒక నాడీ సంబంధిత సమస్య. ఇది టైప్ చేయడం, రాయడం, గ్లాస్ పట్టుకోవడం వంటి పనులు చేస్తున్నప్పుడు ఎక్కువ మందిలో కనిపిస్తుంది.
కెఫిన్ అధికంగా తీసుకోవడం : కాఫీ, టీ లేదా ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమై వణుకు వస్తుంది.

కొన్ని రకాల మెడిసిన్స్: కొన్ని రకాల మందులు ఉదాహరణకి ఉబ్బసం లేదా యాంటిడిప్రెసెంట్స్, కోసం వాడే మందులు వణుకుకు కారణం అవుతాయి.
థైరాయిడ్ సమస్య: థైరాయిడ్ గ్రంధి అధికంగా హార్మోన్లను ఉత్పత్తి చేస్తే, అది చేతులు వణుకు కు కారణం అవ్వచ్చు. అంతేకాక విటమిన్ బి12 వంటి కొన్ని ముఖ్యమైన విటమిన్ల లోపం వల్ల కూడా నాడీ వ్యవస్థ ప్రభావతమైన మనకు వణుకు రావచ్చు.
ఈ వణుకు రోజువారి పనులకు అడ్డగా ఉంటే, అది ఏ పని చేయాలన్నా ఇబ్బంది పెడుతుంటే, లేదా అది తీవ్రమవుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వారు మీ లక్షణాలను బట్టి సరైన పరీక్షలు చేసి కారణాలను కనుగొని చికిత్స సూచిస్తారు.
యువతలో చేతులు వణుకు అనేది కేవలం టెన్షన్ వల్లనే కాదు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా కావచ్చు. ఒత్తిడి, ఆందోళనతో పాటు ఎస్సెన్షియల్ ట్రెమర్, థైరాయిడ్ సమస్యలు లేదా కొన్ని మందుల వల్ల కూడా ఈ వణుకు యువతలో రావచ్చు.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, మీకు ఏదైనా సమస్య ఉంటే దయచేసి వైద్యుడిని సంప్రదించి సరైన సలహా తీసుకోండి.