అందుకే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మేము పాల్గొనడం లేదు – KTR

-

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మేము పాల్గొనడం లేదని తెలిపారు కేటీఆర్‌. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు కొట్టుకుంటున్నారు.. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఈ రాష్ట్ర రైతాంగాన్ని వేధిస్తున్నారని ఆగ్ర‌హించారు కేటీఆర్‌. 20 రోజుల కిందట మేము హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, రాష్ట్రప్రభుత్వం స్పందించలేదు.. అందుకే 70 లక్షల రైతన్నల తరుపున మేము ఎన్నికలు బహిష్కరించామని స్ప‌ష్టం చేశారు.

ktr

మేము ఎన్డీఏ సబార్డినేట్ కాదు, ఇండియా సబార్డినేట్ కాదు.. మేము తెలంగాణ ప్రజల సబార్డినేట్ అన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను తెలియజేయడానికి దీన్ని ఒక వేదికగా వాడుకుంటూ.. రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో మేము పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చారు కేటీఆర్.

మూసీ సుందరీకరణ మీద విడతల వారీగా దోపిడీ చేస్తున్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కేటీఆర్. ఇవాళ మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ…మూసీ సుందరీకరణకు ముందు రూ.1 లక్ష 50 వేల కోట్లు అవుతుందని అన్నారన్నారు.. రూ.16 వేల కోట్లతో అయ్యే ప్రాజెక్టును రూ.1 లక్ష 50 వేల కోట్లతో చెయ్యడమేంటని నిలదీసే సరికి, స్కాంను కూడా ఇన్‌స్టాల్‌మెంట్‌లో చేస్తున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news