అరటిపండుతో ఈ సమస్యలకి ఇలా చెక్ పెట్టండి..!

అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. అరటి పండు లో విటమిన్ బి 6, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఫైబర్ ఉంటాయి. అరటి పండ్లు తీసుకుంటే మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

పండిన అరటి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అయితే పచ్చి అరటి పండు తిన్నా పండిన అరటి పండు తిన్న ఏది తిన్న బ్లడ్ షుగర్ లెవెల్స్ కి సహాయం చేస్తాయి. అదే విధంగా ఆకలి వేసినప్పుడు ఒక అరటి పండు తింటే కడుపు పుల్ గా వుండినట్టు అనిపిస్తుంది.

అరటి పండు లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది హృదయ ఆరోగ్యానికి చాలా మంచిది బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. ఇది ఇలా ఉంటే ఆథ్లెట్స్ కి కూడా అరటి పండు చాలా మంచిది. మజిల్ క్రాంప్స్, ఇంఫ్లేమేషన్ వంటి సమస్యల నుంచి దూరం చేస్తుంది. ఇలా అరటి పండు తో ఎన్నో ప్రయోజనాలు మనం పొందొచ్చు.

ఒక మీడియం సైజ్ అరటి పండు లో విటమిన్ B6 – 33 శాతం, విటమిన్ C – 11 శాతం,పొటాషియం – 9 శాతం, మెగ్నీషియం – 8 శాతం, మాంగనీస్ – 14 శాతం, కాపర్ – 10 శాతం, కార్బన్ – 24 గ్రాములు,ఫైబర్ – 3.1 గ్రాములు, ప్రోటీన్ – 1.3 గ్రాములు, ఫ్యాట్ – 0.4 గ్రాములు.