కేంద్రంపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు… మీరు ఫెయిల్ అయ్యారంటూ ఫైర్…!

వ్యాక్సిన్ల సేకరణకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు గ్లోబల్ టెండర్లు జారీ చేస్తున్నాయని టీకా విషయంలో కేంద్రం విఫలం కాబట్టే ఈ పరిస్థితి వచ్చిందని కేంద్రం వెల్లడించింది. జాతీయ విధానాన్ని తీసుకురావడంలో కేంద్రం ఫెయిల్ అయిందని మండిపడింది. వ్యాక్సిన్లను తీసుకొని పంపిణీ చేసే లాజిస్టిక్స్ మరియు 18+ వయస్సు దాటిన వారికి ప్రభుత్వం ఎందుకు వాక్సిన్ అందించడం లేదని నిలదీసింది.

జస్టిస్ డి.వై.చంద్రచుడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కరోనావైరస్ రోగులకు అవసరమైన మందులు, టీకాలు మరియు మెడికల్ ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన సుమోటు కేసును విచారించింది. 45 ఏళ్లలోపు జనాభాకు వ్యాక్సిన్లు సరఫరా చేయకపోవడం వెనుక ఉన్న కారణాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జాతీయ విధానం ఎప్పుడు తీసుకోస్తారని కూడా కేంద్రం నిలదీసింది.