దాల్చిన చెక్క.. కొంతమందికి దాని వాసనే పడదు. మరికొందరు మాత్రం దాల్చిన చెక్క లేకుండా వంటలే వండరు. అయితే.. దాల్చిన చెక్కలో ఎన్నో సుగుణాలున్నాయట. ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్న దాల్చిన చెక్కను తింటే ఎటువంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి.
దాల్చిన చెక్క ఎక్కువగా కేరళతో పండుతుంది. దాన్ని తమాలా అని పిలుస్తారు. మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు దాల్చిన చెక్కను రోజూ 10 గ్రాముల వరకు తీసుకుంటే దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. టైప్ 2 మధుమేహం ఉన్నవాళ్లలో గ్లూకోజ్ ను నియంత్రించడానికి కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుందట. అంటే.. బాడీలోని చెడు కొలెస్టరాల్, ట్రైగ్లిసరైడ్లను దాల్చిన చెక్క తగ్గిస్తుందని కాలిఫోర్నియాలోని వెస్టర్న్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సైంటిస్టుల పరిశోధనలో వెల్లడయింది.
మలబద్ధకం, జీర్ణ సంబంధ సమస్యలున్నవాళ్లు దాల్చిన చెక్కను రోజూ తమ ఆహారంలో భాగంగా చేసుకుంటే.. కొద్ది రోజుల్లోనే ఆ సమస్యలను దూరం చేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.