నంబర్ 1 ఎన్టీఆర్.. ఆ తర్వాతే ఎవరైనా..!

-

స్టార్ హీరోల పొజిషన్ సినిమా సినిమాకు మారుతుంది. అసలు చిరంజీవి తర్వాత టాలీవుడ్ నంబర్ 1 స్థానం అలానే ఉందని అంటారు. రీ ఎంట్రీలో మళ్లీ చిరునే టాప్ అయ్యే పరిస్థితి ఉన్నా ఆయన సీనియర్ స్టార్ గా పరిగణలోకి వచ్చాడు. ఇదిలాఉంటే తన దృష్టిలో నంబర్ 1 ఎన్.టి.ఆర్ అనేశాడు ప్రభాస్. రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ప్రభాస్ 1,2,3,4 ఇవ్వాల్సి ఇస్తే.. మహేష్, ఎన్.టి.ఆర్, రాం చరణ్, బన్నిలలో ఎవరికి ఇస్తావని అన్నాడు కరణ్.

క్షణం ఆలోచించకుండా నంబర్ 1 ఎన్.టి.ఆర్, 2,3,4లలో మహేష్, బన్ని, రాం చరణ్ అన్నాడు. సో ప్రభాస్ దృష్టిలో స్టార్స్ ఎంతమంది ఉన్నా ఎన్.టి.ఆర్ ది బెస్ట్ అని అంటున్నాడు. అయితే ప్రభాస్ చెప్పాడని కాదు కాని ఎన్.టి.ఆర్ ఎలాంటి పాత్రతో అయినా అదరగొట్టేస్తాడు. లెక్కలు పక్కన పెడితే టాలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పుడు తమ ఫ్యాన్స్ ను మెప్పించడమే కాకుండా సూపర్ హిట్ సినిమాలతో పరిశ్రమ బాగు కోసం కృషి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version