పూర్తి ఆరోగ్యం బాగుండాలని ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను తీసుకోవడం మరియు జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వంటివి అందరూ చేస్తూ ఉంటారు. కాకపోతే రోజు వారీ జీవితంలో ఉపయోగించే వస్తువులు కూడా ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మీ వంట గదిలో ఈ వస్తువులను అసలు ఉంచకూడదు. తీసుకొని ఆహారం మరియు వండుకునే ఆహారం మాత్రమే కాకుండా, కొన్ని వస్తువుల వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక వీటి వినియోగాన్ని వీలైనంతవరకు తగ్గించాలి అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో వంట గదిలో ఉపయోగించే వస్తువులలో నాన్ స్టిక్ పాన్ ఎంతో ప్రమాదకరం.
దీనిని ఉపయోగించడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నాన్ స్టిక్ పాత్రలను ఎక్కువగా వేడి చేయడం వలన విషపూరిత పగలు విడుదలవుతాయి. అంతేకాకుండా వాటి పై గీతాలు పడినప్పుడు హానికరమైన రసాయనాలు ఆహారంలో కలిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో హార్మోన్లకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. పైగా రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. కనుక వీటిని ఉపయోగించడం తగ్గించాలి. వాటికి బదులుగా స్టెయిన్‌లెస్ స్టీల్, కాస్ట్ ఐరన్ లేదా సిరామిక్ పాత్రలను ఉపయోగించాలి.
అంతేకాకుండా ఆహారాన్ని నిల్వ చేయడానికి ప్లాస్టిక్ ను అస్సలు ఉపయోగించకూడదు. నాసిరకం ప్లాస్టిక్‌ను ఉపయోగించడం వలన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అంతేకాకుండా కొన్ని రకాల పాత్రలను మైక్రోవేవ్‌లో పెట్టినప్పుడు వాటి నుంచి విడుదలయ్యే హానికరమైన హానికరమైన రసాయనాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాగే అల్యూమినియం ఫాయిల్ ను కూడా వీలైనంతవరకు తగ్గించాలి. ఎక్కువగా అల్యూమినియం ఫాయిల్ ను ఉపయోగించడం వలన ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా పర్యావరణానికి కూడా హానికరం అని నిపుణులు చెబుతున్నారు. కనుక ఇటువంటి వస్తువులను వీలైనంతవరకు వినియోగించకుండా ఉండాలి. వీటికి బదులుగా మంచి ఇతర వస్తువులను ఎంపిక చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.