వేరుశ‌న‌గ‌లు ఇలా తింటే బోలెడ‌న్నీ ప్ర‌యోజ‌నాలు..!

-

వేరుశ‌న‌గ‌లు ఆరోగ్యానికి మంచిదే అన్న విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే వీటిని ఎలా తింటే మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు చేకూర‌తాయో ఖ‌చ్చితంగా తెలుసుకోవాలి. వేరుశ‌న‌గ‌ల్లో మాంసకృత్తులు, పీచు పద్దార్థాలు, పిండి పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేసే శక్తికి వీటికి ఉన్నాయి. వేడి వేడి వేరు శనగలంటే అందరూ ఇష్టపడుతారు. కాలక్షేపం కోసం చిరు వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి తినడం చాలా ఉత్తమం. ప్రధానంగా వంటల్లో వేరుశనగ నూనెను అమితంగా వాడుతారు. అయితే చాలా మంది వేరుశ‌న‌గ‌లు తొక్క తీసేసి తింటారు.

కానీ ప‌ల్లీలను తొక్క‌ల‌తో తింటేనే చాలా మంచిది. అలాగే వేరుశనగ గింజల తొక్కల్లో ఆరోగ్యాన్ని పెంచే, రోజువారీ అవసరమయ్యే చాలా పోషకాలున్నాయి. విటమిన్ సీ, గ్రీన్ టీ కంటే వేపిన వేరు శనగ గింజలకు ఉండే తొక్కల్లో యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంది. అలాగే వేరుశనగ తొక్కల్లో కూడా గుండె జబ్బులు, కాన్సర్, హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకునే గుణాలున్నాయి. మ‌రో విష‌యం ఏంటంటే.. మామూలు వేరు శనగ గింజల కంటే వేపిన వేరుశనగ గింజల తొక్కలకు ఎక్కువ విష వ్యర్థాల్ని అడ్డుకునే శక్తి ఉంటుంది. సో.. ఎప్పుడూ వేరుశ‌న‌గ‌ల‌ను తొక్క తీమ‌కుండానే తిన‌డానికి ప్ర‌య‌త్నించండి. అప్పుడే ఎక్కువ లాభాలు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news