ప్రైవేట్ బ‌స్సుల‌కు పేర్ని నాని స్ట్రోంగ్ వార్నింగ్‌..

-

సాధార‌ణంగా ఏదైనా పండ‌గ వ‌చ్చిందంటే చాలా ప్రైవేట్ బ‌స్సులు ధరలు పెంచేస్తారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలన్నా అక్కడా అరకొర సర్వీసులే నడుస్తున్నాయి. దీంతో చాలామంది విధిలేక అందుబాటులో ఉన్న ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీనినే అవకాశంగా తీసుకుని ఇష్టానుసారం టిక్కెట్ల రేట్లు పెంచుకుంటూపోతూ క్యాష్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా ప్రైవేట్ బ‌స్సుల యాజ‌మాన్యానికి పేర్ని నాని స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలు పాటించని బస్సులపై చర్యలు తప్పవని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు.

ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా 516 బస్సులు సీజ్‌ చేశామని ఆయ‌న తెలిపారు. ప్రైవేట్‌ బస్సుల్లో అధికచార్జీలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని, పండగ పేరుతో దోపిడీ చేసిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు. అలాగే నేటి నుంచి ఈ నెల 20వ తేది వ‌ర‌కు మళ్లీ తనిఖీలు నిర్వహిస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. మ‌రియు సంక్రాంతికి మూడు వేలకు పైగా స్పెషల్‌ బస్సులు నడిపామని పేర్ని నాని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news