కొవిడ్-19 ఎక్కువగా వ్యాపించేది చేతుల ద్వారా. శరీరంలోకి ప్రవేశించేది కళ్లు, ముక్కు ద్వారా. సో.. డోంట్ టచ్ యువర్ ఫేస్.
కరోనావైరస్ (కొవిడ్-19) దురదృష్టవశాత్తు మనదేశంలోకి కూడా ప్రవేశించింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తెలంగాణలో ఒక కేసును గుర్తించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ పేషెంటుకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో అత్యంత కట్టుదిట్టాల మధ్య చికిత్సనందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని అన్ని రకాల ముందస్తు జాగ్రత్తల కోసం అధికారులను ఆదేశించింది.
ఏదేమైనా, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం అత్యుత్తమం. కొవిడ్-19 మనుషుల నుంచి మనుషులకు వేగంగా వ్యాపిస్తుంది. దానికి మానవ శరీరంలో ప్రవేశ ద్వారాలు, కళ్లు, ముక్కు, నోరు. కాబట్టి ప్రధానంగా వాటిని కాపాడుకోవాలి. అమెరికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) విడుదల చేసిన సూచనల ప్రకారం, చేతులకు కొవిడ్ వైరస్ అంటినా ప్రమాదకరం కాదు. కానీ, ఆ చేతులతో మన ముఖాన్ని ముట్టుకుంటే మాత్రం వైరస్ శరీరంలోకి ప్రవేశించినట్లే.
ఈ ముఖ జాగ్రత్త ఎందుకంటే, కరోనా, ఫ్లూ లాంటి శ్వాససంబంధిత వైరస్‌లు, ముందుగా మన చేతులకు అంటుకుని, మనం కళ్లు, ముక్కు నలుపుకున్నప్పుడు వాటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. సాధారణంగా మనం రోజువారీ జీవితంలో చాలా వస్తువులను, మనుషులను ముట్టుకుంటాం. డోర్ హ్యాండిల్స్, కీబోర్డ్, మొబైల్ ఫోన్, షేక్‌హ్యాండ్స్.. ఇలా. తర్వాత చేతులను కడుక్కోకుండానే ముఖాన్ని టచ్ చేస్తాం. ఇది చాలు, కొవిడ్-19కి మనలోకి రావడానికి.
చేతులు అత్యంత పరిశుభ్రంగా, తరచూ కడగడం చాలా చాలా అవసరం. సబ్సు వాడి, బాగా నురగ వచ్చేంతవరకు రుద్ది, అప్పుడు నీళ్లతో కడగాలి. ఆల్కహాల్ ఆధారిత సానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకున్నా సరిపోతుంది. స్నేహితులతో, బంధువులతో, సహోద్యోగులతో కరచాలనం చేయడం మనకు బాటా అలవాటు. దాన్ని పూర్తిగా మానేయండి. అలాగే పెక్. భారత్‌లో పెద్దగా పరిచయం లేకపోయినా, విదేశాల్లో బాగా పాపులర్ పలకరింపు. ఒకరినొకరు చెంపలు ఆనించుకుని పలకరించుకోవడం అక్కడ ఆనవాయితీ. అలాంటి అలవాట్లకు కూడా దూరం ఉండండి. అలాగే ఏసీలు వేసుకోకుండా ఉంటే మంచిది. కొవిడ్ వైరస్ చల్లని వాతావరణంలో ఎక్కువసేపు బతికిఉంటుంది.
నిజానికి ముఖాన్ని ముట్టుకోకుండా ఉండటం చాలా కష్టమైన పని. కానీ తప్పదు. ముఖాన్ని ముట్టుకునే అవసరం ఎప్పుడొస్తోందో కాస్తా పరిశీలించండి. దాన్ని నిరోధించడానికి ఏ మార్గమైతే బెస్ట్ అనిపిస్తోందో ఆలోచించండి. కళ్లకు గ్లాసెస్ ధరించడం ద్వారా కళ్లను రుద్దే అవసరం తగ్గిపోతుంది. ఆలాగే ముక్కు కూడా. దురద పుడితే కాసేపు ఎండలో నిల్చోండి. దురద తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా కొన్ని మార్గాలు వెతుక్కోండి.
మళ్లీ చెపుతున్నాం…
1. షేక్ హ్యాండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఇవ్వకండి. ఎవరైనా అలవాటుగా చేయి ముందుకు చాపితే, మన సంస్కృతి ప్రకారం రెండు చేతులు జోడించి నమస్కారం చేయండి లేదా హాయ్, హలో అంటూ చేయి ఊపండి చాలు.
2. చేతులు తరచూ బాగా శుభ్రపరచుకోవడం మరిచిపోవద్దు. సబ్బు, ఆల్కాహాల్ ఆధారిత సానిటైజర్‌లను వాడండి.
3. నోరు ఎప్పుడూ పొడిగా ఉండొద్దు. అందుకని తరచూ నీళ్లు తాగండి. చల్లనివి వద్దు. ఒకవేళ మన గొంతులోకి వైరస్ ప్రవేశించినా, నీళ్లు తాగడం వల్ల అది కడుపులోకి జారిపోతుంది. దాంతో కడుపులో ఉన్న యాసిడ్స్ ఆ వైరస్‌ను వెంటనే చంపేస్తాయి.