ఈరోజుల్లో చాలామందికి గ్యాస్ సమస్య ఉంటుంది. కొన్నిసార్లు గ్యాస్ పట్టేసి ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. గ్యాస్ నొప్పి, గుండె నొప్పి ఒకేలా ఉండటంతో మనకు వచ్చింది ఏం నొప్పి అనేది తెలుసుకోలేక ఒక సమస్యకు ఇంకో చికిత్స చేస్తుంటాం.. మీకు నిజంగా గుండె నొప్పి వస్తుంటే. మీరు అది గ్యాస్ అనుకుంటే.. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం అవుతుంది కదా.. మీలో ఎంత మంది గ్యాస్ నొప్పిని గుండె నొప్పి అనుకోని భయపడ్డారు.. ఇక ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఈ రెండు నొప్పులను ఎలా గుర్తించాలో ఈజీగా తెలుసుకుందాం..!
గ్యాస్ నొప్పి వస్తే కనిపించే లక్షణాలు
ఛాతిలో ఎడమ వైపు నొప్పిగా ఉంటుంది.
కడుపు ఉబ్బరంగా ఉంటుంది.
సాధారణ లేదా పుల్లని త్రేన్పులు వస్తాయి.
కడుపులో మంటగా ఉంటుంది. గుండెల్లో మంట వస్తుంది.
గుండె నొప్పి వస్తే కనిపించే లక్షణాలు
గుండె మధ్యన చాలా బరువుగా వుంటుంది. ఛాతి మీద ఏదో బరువు పెట్టినట్లు అనిపిస్తుంది.
విపరీతమైన చెమట పడుతుంది.
ఎడమ చెయ్యి, భుజం, ఎడమ వైపు మెడ లాగుతూ ఉంటాయి.
కొందరిలో విరేచనాలు అవుతాయి.
కొందరికి వాంతులు అవుతాయి.
ఎడమ వైపు దవడ నొప్పిగా ఉంటుంది. పట్టేసినట్లు అనిపిస్తుంది.
ఛాతి మధ్య భాగం నుంచి నిలువుగా గడ్డం వరకు నొప్పి ఉంటుంది.
కొందరికి ఛాతి మొత్తం నొప్పి ఉంటుంది.
స్పృహ తప్పి పడిపోతారు.
ఇలా గ్యాస్ నొప్పి, గుండె నొప్పి లక్షణాలను మనం గమనించవచ్చు. అయితే కొందరికి గ్యాస్ నొప్పి లక్షణాలతోనూ గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంది..కాబట్టి ఏ నొప్పి అయినా సరే అశ్రద్ధ చేయకూడదు. పరీక్షలు చేయించుకుంటే మంచిది. సమస్య లేకపోతే సరే. కానీ ఉంటే మాత్రం పరీక్షల్లో తెలుస్తుంది. దీంతో గుండె పోటు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.
ఈ సమస్యలు ఏవీ రావొద్దు అంటే.. మీరు ఇప్పటినుంచి మంచి లైఫ్‌స్టైల్‌ను పాటించండి..వేళకుతినండి.. అది కూడా ఇంట్లో వండినవి మాత్రమే తినండి.. బయట ఆహారాలు ఇప్పుడు ఏవి క్వాలిటీగా ఉండటం లేదు. అనవసరంగా డబ్బులిచ్చి మరీ ఆరోగ్యాన్ని ఎందుకు పాడుచేసుకోవడం.!