ఈ రోజు ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ మరియు గుజరాత్ జాయింట్స్ ల మధ్యన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ కనుక గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరువవవుతుంది, అదే ముంబై ఇండియన్స్ గెలిస్తే ప్లే ఆఫ్ కు వెళ్ళడానికి ముందుకు వెళుతుంది. కాగా ముంబై జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్న యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ గత రెండు మ్యాచ్ లుగా బరిలోకి దిగలేదన్న విషయం తెలిసిందే. భరించలేని జ్వరం కారణంగా విశ్రాంతిలో ఉన్నాడు. అయితే ముంబై ఇండియన్స్ యాజమాన్యం తెలిపిన సమాచారం ప్రకారం తిలక్ వర్మ పూర్తిగా కోలుకున్నాడని ఈ రోజు మ్యాచ్ లో ఆడుతాడని పేర్కొంది.
ఐపీఎల్ 2023: ముంబై మ్యాచ్ లో “మ్యాచ్ విన్నర్” తిలక్ వర్మ ఫిట్.. !
-