కొంపముంచుతున్న కొలెస్ట్రాల్‌ కంట్రోల్లో లేకపోతే ఎముకలు విరిగిపోతాయట..!

-

కొలెస్ట్రాల్‌తో బరువు పెరుగుతారని తెలుసు కానీ ఇది ఇంత కొంప ముంచుతుందని మీకు తెలుసా..? కొలెస్ట్రాల్‌ కంట్రోల్లో లేకపోతే ఎముకలు విరిగిపోతాయట. అధిక కొలెస్ట్రాల్‌ కారణంగా గుండె జబ్బు, మధుమేహం, బీపీ రావడం సాధారణం. ఇదేంది భయ్యా.. ఎముకలు కూడా విరిగిపోతాయా..? భారతదేశంలోని దాదాపు 25-30 శాతం పట్టణ ప్రజలు, 15-20 శాతం గ్రామీణ జనాభా అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారని అంచనా. అయితే అనియంత్రిత కొలెస్ట్రాల్ ఎముకల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని చాలా తక్కువ మందికే తెలుసు.

bones

 

కొలెస్ట్రాల్, ఎముకల ఆరోగ్యానికి ఏంటి సంబంధం

కొలెస్ట్రాల్ అనేది కాలేయం ద్వారా ఉత్పత్తి చేయబడిన కొవ్వు పదార్థం. కొన్ని ఆహారాలు అధికంగా తీసుకున్నప్పుడు ఇది ఏర్పడుతుంది. శరీర సాధారణ పనితీరుకి ఇది చాలా అవసరం. హార్మోన్ ఉత్పత్తి, బైల్ యాసిడ్ సింథసిస్ సహా వివిధ ప్రక్రియలలో పాల్గొంటుంది. ఇది ఎముకల్ని ప్రభావితం చేస్తుంది. కొలెస్ట్రాల్ ఎముకల నష్టానికి దోహదపడుతుంది. ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు ఆస్టియోబ్లాస్ట్‌లపై ప్రభావం చూపుతాయి. ఆస్టియోక్లాస్ట్ ఎముక ఏర్పడటానికి కారణమయ్యే కణాలకు సంబంధించిన కార్యాలపాలు పెంచుతాయి. ఈ అసమతుల్యత కాలక్రమేణా ఎముక ద్రవ్యరాశిని కోల్పోయేలా చేస్తుంది.

బోలు ఎముకల వ్యాధి

అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు బోలు ఎముకల వ్యాధి అభివృద్ధికి దారి తీస్తాయి. ఇది పెళుసుగా, బలహీనమైన ఎముకలతో కూడిన రుగ్మత. అధిక కొలెస్ట్రాల్ ఎముక పెరుగుదల విషయంలో సమతుల్యానికి దారి తీస్తుంది. ఫలితంగా పగుళ్లు వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల ఎముకలు బలహీనమవుతాయి. తేలికపాటి గాయాల నుంచి పగుళ్ళకి గురయ్యే అవకాశం ఉంది. తుంటి, వెన్నెముక, మణికట్టులో ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి.

వాపు, ఆక్సీకరణ ఒత్తిడి

అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు దీర్ఘకాలిక మంట, ఆక్సీకరణ ఒత్తిడితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రెండూ ఎముక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి వల్ల ఎముకలకు నష్టం జరుగుతుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్‌లో ఉంచుకోవడం దీనికి సరైన మార్గం. స్టాటీన్స్ వంటి కొన్ని మందులు ఎముకల ఆరోగ్యానికి నష్టం వాటిల్లకుండా చేస్తాయి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, డైలీ వ్యాయామాం చేసుకుంటూ, శరీరానికి సరిపడా విటమిన్‌ డీ అందిస్తే కొలెస్ట్రాల్‌ సమస్య ఉండదు. ఎముకలు పటిష్టంగా ఉండేందుకు విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా తీసుకోవాలి. పాల ఉత్పత్తులు, ఆకుకూరలు తీసుకుంటే మంచిది. సూర్యరశ్మి నుంచి తగినంత విటమిన్ డి పొందేలా చూసుకోవాలి. లేదంటే నిపుణుల సలహా ప్రకారం సప్లిమెంట్లు తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version