ఆంధ్రప్రదేశ్ లో రేపు అనగా జులై అయిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ చేయడానికి ABVP సంస్థ ప్రణాళికలు చేసుకుంది. ఈ బంద్ ను విజయవంతం చేయాలను ABVP కార్యకర్తలకు పిలుపునిచ్చింది. కాగా వీరు చేస్తున్న ఈ బంద్ కు ప్రధాన కారణాలుగా కొన్నింటినీ తెలిపారు. అందులో ఇప్పుడు సామాన్య కుటుంబాల నుండి వస్తున్న విద్యార్థులకు చదువు చాలా భారంగా మారిపోయింది. ఒకవైపు ప్రవైట్ పాఠశాలలు మరోవైపు కార్పొరేట్ పాఠశాలలు ఏవేవో మాటలు చెప్పి ఫీజులను అమాంతం పెంచేస్తున్నారు. డబ్బున్న వాళ్ళు ఎంత ఫీజు అయినా సరే చెల్లించి చదువును కొనగలరు. కానీ పేద విద్యార్థులకు అంత డబ్బు చెల్లించి చదువుకోవాలంటే కష్టంగా మారుతున్న తరుణంలో ఫిజులను తగ్గించాలని ప్రయివేట్ మరియు కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలను ABVP డిమాండ్ చేస్తోంది.
AP: రేపు స్కూల్స్ బంద్ చేయనున్న ABVP… డిమాండ్స్ ఇవే ?
-