ఈ లక్షణాలు ఉంటే… ఇమ్యూనిటీ తక్కువ ఉన్నట్టే..!

-

ఆరోగ్యం: ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పై శ్రద్ధ ఎక్కువ పెడుతుంటారు. ఆరోగ్యం బాగుండాలంటే సరైన జీవన విధానాన్ని కచ్చితంగా అనుసరించాలి. చాలా మందిలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది. మీకు కూడా రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉందేమో అని సందేహం ఉందా..? అయితే ఈ లక్షణాల ద్వారా గుర్తించొచ్చు. ఈ లక్షణాలు కనుక ఉంటే కచ్చితంగా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నట్లే.

మరి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని ఎలా తెలుసుకోవచ్చు..? ఎలాంటి లక్షణాలు కనబడతాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. రోగ నిరోధక శక్తి కనుక తక్కువ ఉన్నట్లయితే ఎక్కువగా స్టొమక్ అప్సెట్ సమస్య కలుగుతుంది. కడుపు లో ఇబ్బందులు ఉంటాయి. ఉదర సంబంధిత సమస్యలు ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వ్యాపిస్తూ ఉంటాయి. పైగా జీర్ణం సరిగ్గా అవ్వదు.

జీర్ణ సమస్యలు పదే పదే కలుగుతూ ఉంటాయి. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వదు దీంతో మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలానే రోగ నిరోధక శక్తి సరిగ్గా లేదంటే పింపుల్స్ కురుపులు వంటివి ఎక్కువగా కలిగి అవి తగ్గడానికి ఎక్కువ కాలం పడుతుంది. ఇలా పడుతున్నట్లయితే కూడా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నట్లు చెప్పొచ్చు. తరచూ జలుబు దగ్గు జ్వరం తల నొప్పి బలహీనత మొదలైన సమస్యలు మీరు ఎదుర్కొంటున్నట్లైతే కూడా రోగ నిరోధక శక్తి మీకు తక్కువ ఉందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version