జ్వరం వచ్చినప్పుడు పండ్ల రసాలు తాగుతున్నారా..? మంచిదేనా..?

-

జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా ఏం తినాలనిపించదు. తిన్నగా కూడా అరగదు.. అసలే ఒళ్లు నొప్పులతో బాధపడుతుంటే..మళ్లీ ఏం తినకుండా ఉంటే దానికి నీరసం తోడవుతుందని.. చాలామంది పండ్ల రసాలు తాగుతారు. దాంతో తేలిగ్గా అరుగుతుంది. నీరసంగా ఉండదు అని మనకు తెలిసిన విషయం.. అసలు జ్వరం వచ్చినప్పుడు ఫ్రూట్‌ జ్యూస్‌ తాగొచ్చా..? తీసుకుంటే ఎలాంటివి తాగాలి..?
జ్వరం కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీరంలో నీటి కొరత కూడా ఏర్పడుతుంది. దీనిని అధిగమించడానికి జ్యూస్ తాగాలని వైద్యులు సూచిస్తారు. జ్వరంతో పాటు, తరచుగా జలుబు, దగ్గు సమస్య కూడా చాలామందిలో వస్తుంది. పండ్ల రసం తాగడం వల్ల శరీరంలో నీటి కొరత తీరి డీహైడ్రేషన్ సమస్య దూరమవుతుంది. చాలా పండ్లలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జ్వరంతో పోరాడే శక్తిని అందిస్తాయి. ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల వ్యాధులతో పోరాడే శక్తి పెరుగుతుంది. అందుకే జ్వరం సమయంలో పండ్ల రసం తాగడం మంచిది. అయితే ఫ్రూట్ జ్యూస్‌కు బదులు మొత్తం పండ్లను తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు..
ఏ పండ్ల రసం తాగాలి?
జ్వరం వచ్చినప్పుడు సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ తాగడం మేలు. ఆరెంజ్, సీజనల్, ద్రాక్షపండు, నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్ల రసాన్ని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగుతుంది.
కూరగాయలు..

పండ్లతో పాటు.. జ్వరం ఉన్న సమయంలో తినడానికి ప్రయోజనకరమైన కొన్ని కూరగాయలు ఉన్నాయి. విటమిన్ సి పుష్కలంగా ఉన్న కూరగాయలు, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. ఆకు కూరలు, పప్పులు కూడా జ్వరంలో మంచిదేనని నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే జ్వరం వచ్చిన మొదటి రోజు.. ఓ కంగారుపడిపోయి.. ట్యాబ్లెట్‌ వేసుకోవాల్సి పని లేదు.. వచ్చిన వైరస్‌ను మనలో ఉన్న రోగనిరోధక శక్తి దాడి చేసి చంపనివ్వండి. దానికి పనిలేకుండా మీరు వెంటనే టాబ్లెట్‌ వేయడం వల్ల జ్వరం తగ్గుతుందేమో కానీ..ఇమ్యూనిటీ బలహీనమవుతుంది. ఎలాంటి జ్వరమైన మూడు రోజుల కంటే ఎక్కువ ఉంటేనే టాబ్లెట్‌ వాడాలి. అప్పటి వరకూ.. ఇలాంటి పండ్ల రసాలు, మంచి కూరగాయలు తీసుకుని రెస్ట్‌ తీసుకుంటే సరి.!

Read more RELATED
Recommended to you

Exit mobile version