పరుపులపై పడుకుంటే.. కళ్లు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయా..?

-

ఒకప్పుడు పాటించిన అలవాట్లు ఏవీ ఇప్పుడు మనం పాటించడం లేదు. అవి అన్నీ పాతకాలం నాటివి అనేస్తున్నాం.. తినేవి, తాగేవి.. వేసుకునే బట్టలు, ఇంట్లో వాడే సామాన్లు.. అన్నీ మారిపోయాయి..నులక మంచం ఈరోజుల్లో ఎంత మంది ఇంట్లో ఉంది..? నేలపై చాప వేసుకుని పడుకునే అలవాటు ఉందా అసలు ఈ తరం వాళ్లకు.. మెత్తడి పరువులు.. సుఖమైన నిద్ర.. అంతా బానే ఉంది కదా..! కానీ పరుపుల మీద పడక మంచిది కాదంటున్నారు వైద్యులు..

పరువు మీద పడుకోవడం వల్ల వచ్చే సమస్యలు..

పరుపుల తయారీలో ఫార్మల్డ్ హైడ్, బెంజీన్, నాఫ్తలీన్ లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటి కారణంగా కళ్లు, ఊపిరితిత్తులు, చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అలర్జీలు, దురదలు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది. నాఫ్తలీన్ కారణంగా మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. నాఫ్తలీన్ అనే రసాయనం కారణంగా పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.బెంజీన్ కారణంగా కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది. దీనివలన ఆరోగ్యంగా ఉండే కణాలు క్యాన్సర్ కణాలుగా మారే ఛాన్స్ ఉంది.
స్పాంజి పరుపుల ద్వారా వేడి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని ప్రభావం శరీరంపై పడుతుంది. పరుపుల్లో ఉండే కుషనింగ్ కారణంగా వాటి మీద పడుకుంటే.. మన శరీర ఆకృతి మారుతుంది. డిస్క్ లపై ఒత్తిడి పడుతుంది. డిస్క్‌లు పక్కకు జరగడం ఉంటుంది. డిస్క్‌లు పక్కకు జరిగితే.. నరాలు, వెన్నుపాముపై ఒత్తిడి పడుతుంది.
దూదితో తయారు చేసే పరుపులకు ప్రాధాన్యత ఇవ్వండి. నేలపై పడుకుంటే చాలా మంచిది. మెుదట కాస్త ఇబ్బంది ఉన్నా.. అలవాటు అయితే.. మంచి నిద్ర వస్తుంది నేలపై నిద్రిస్తే.. ఒత్తిడి తగ్గుతుంది. మెంటల్ హెల్త్ కండీషన్ బాగుంటుంది. వెన్నునొప్పితో బాధపడే వాళ్లు.. నేలపై పడుకుంటే ఆరోగ్యం. శరీరాకృతి కూడా మెరుగవుతుంది. ఇవన్నీ చెప్పడానికి వినడానికి బాగుంటాయి..కానీ మనతోని ఎక్కడ అవుతుందిలే నేలపై పడుకోవడం అనుకుంటున్నారా..? అయితే వాడే పరుపులు మంచివి ఎంచుకోండి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version