అక్కడ పది నిమిషాలు నడిస్తే.. అన్ని రోగాలు నయం అవుతాయట..!

-

రోగాలు: సన్నగా అవడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు అందరూ ముందు చేసే పని వాకింగ్… రోజు ఎంతో కొంత దూరం నడిస్తే చాలా మంచిదని మనకూ తెలుసు.. డాక్టర్లు కూడా రోజు కనీసం అరగంట పాటైన నడవమని చెప్తుంటారు. నడవడం వల్ల కేలరీలు బర్న్‌ అవుతాయి. మనిషి ఫిట్‌గా ఉంటాడు. అయితే నార్మల్‌గా ఫ్లాట్ సర్ఫెస్‌పై నడవడం కంటే కూడా ఆక్యుప్రెషర్‌పై వాక్ చేస్తే చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.

ఆక్యుప్రెషర్ పై రోజూ కొన్ని నిమిషాల నడిస్తే.. అనేక వ్యాధులు నయమవుతాయి. రాజస్థాన్ అల్వార్ నగరంలోని నెహ్రూ గార్డెన్‌లో తయారు చేసిన ఆక్యుప్రెషర్ మార్గంలో ప్రజలు ఉదయం, సాయంత్రం నడుస్తున్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ఆక్యుప్రెషర్‌ పాత్‌ను నిర్మించిన పార్క్‌ జిల్లాలోనే నెహ్రూ గార్డెన్‌ మొదటి పార్కు.

తోటలో ఇతర అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. ప్రజల సందర్శనార్థం నెహ్రూ గార్డెన్‌లో ఆక్యుప్రెషర్ ఫుట్‌పాత్‌ను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఆక్యుప్రెషర్ మార్గంలో క్రమం తప్పకుండా నడవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చు.

దీని మీద క్రమం తప్పకుండా నడవడం వల్ల తలనొప్పి, పక్షవాతం, హైపో థైరాయిడ్, గ్యాస్ట్రిక్, మలబద్ధకం, మధుమేహం, దగ్గు, ఉబ్బసం మొదలైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నెహ్రూ గార్డెన్‌లో నిర్మించిన ఆక్యుప్రెషర్ ఫుట్‌పాత్‌పై ప్రజలు చెప్పులు లేకుండా నడుస్తున్నారు. దీంతో ఇక్కడ నడిచే వారికి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతోందట.

ఆక్యుప్రెషర్‌ ఫుట్‌పాత్‌పై నడవడం వల్ల మనకు బ్లడ్‌ సర్కులేషన్‌ బాగా జరుగుతుంది.. శరీరంలో రక్తం సరఫరా బాగున్నప్పుడు అన్ని సమస్యలు తగ్గుతాయి. అందుకే.. షుగర్‌, బీపీ, మోకాళ్ల నొప్పులు ఉన్నవాళ్లకోసం.. ప్రత్యేకమైన చొప్పులు కూడా ఉన్నాయి. మనం అలాంటి చొప్పులతో నడవడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version