అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఆయన భార్యతో విడిపోయిన విషయం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన తన జీవితంలో మరో అడుగు ముందుకేశారు. జెఫ్ బెజోస్ తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.
వీరివురు త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. లారెన్ ఇటీవల హృదయాకారంలో ఉన్న చేతి ఉంగరాన్ని ధరించడం ప్రారంభించినప్పటి నుంచి ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.
లారెన్ గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బెజోస్, లారెన్ 2018 నుంచే డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే, 2019 వరకు ఆ విషయం బయటకు రాలేదు. బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్‌తో ఉన్న 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరివురికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు లారెన్, బెజోస్.. తమ మధ్య బంధాన్ని బయటకు అధికారికంగా వెల్లడించలేదు.