వేసవిలో ఫ్రిడ్జ్ లో పెట్టకుండానే మంచి నీళ్లు చల్లగా ఉండాలంటే… ఈ పద్ధతులు బెస్ట్..!

-

మంచి నీళ్లు: ఎండాకాలంలో వేడి విపరీతంగా ఉంటుంది అలాంటి సమయంలో నీళ్లు కూడా వేడి నీళ్లగా మారిపోతూ ఉంటాయి. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి చల్లటి పానీయాలు చల్లటి నీళ్లు తాగాలని ఉంటుంది. వేడి నీళ్లు తాగాలని అనిపించదు. చాలా మంది చల్లగా నీళ్లు మారాలని ఫ్రిజ్లో పెడుతూ ఉంటారు. కానీ ఫ్రిజ్లో పెట్టి నీళ్లు తీసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతూ ఉంటాయి అలా సైడ్ ఎఫెక్ట్స్ కలగకుండా నీళ్లు చల్లగా మారాలంటే ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి.

కుండ నీళ్లు..

మీరు కుండలో నీళ్ళని ఉంచి తీసుకుంటే నీళ్లు చల్లగా ఉంటాయి. దాహం బాగా తీరుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలగవు. రాత్రిపూట కుండలో నీళ్ళని నింపి వదిలేయండి. అప్పుడు అవి చల్లగా ఉంటాయి. ఆ నీళ్ళని తాగితే దాహం బాగా తీరుతుంది. పైగా కుండ నీళ్లు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

తడిబట్ట చుడితే కూడా…

నీళ్లు బాగా చల్లగా ఉండాలంటే నీళ్లని ఉంచే బిందెల్ని కానీ బాటిల్స్ ని కానీ తడి బట్ట తో చుట్టండి ఇలా చేస్తే కూడా నీళ్లు చల్లగా ఉంటాయి తడి బట్టని ఇలా బిందుకి కానీ బాటిల్ కి కానీ చుడితే నీళ్లు బాగుంటాయి. వేడిగా మారిపోవు.

వాక్యూమ్ ఇన్సులేటెడ్ బాటిల్స్..

చల్లటి నీళ్లు వేడిగా మారిపోకుండా ఉండడానికి వాక్యూమ్ ఇన్సులేటెడ్ బాటిల్స్ కూడా వాడొచ్చు. ఈ బాటిల్స్ లో నీటిని స్టోర్ చేస్తే ఏ టెంపరేచర్లో అయితే నీటిని ఉంచారో అదే టెంపరేచర్ లో ఉంటాయి వేడి అయిపోకుండా ఇవి చేస్తాయి. రాత్రిపూట నీళ్ళని ఇంట్లో వదిలేయకుండా బయట పెడితే కూడా నీళ్లు చల్లగా ఉంటాయి.

మట్టిలో కానీ ఇసుకలో కానీ స్టోర్ చేస్తే..

కొంచెం మట్టిలో కానీ ఇసుకలో కానీ మీరు వాటర్ ని స్టోర్ చేసే బిందెల్ని లేదంటే బాటిల్స్ ఉంచితే కూడా నీళ్లు చల్లగా ఉంటాయి. వేడెక్కకుండా ఉంటాయి. పొడవైన సాక్సులని బాటిల్స్ కి చుడితే కూడా నీళ్లు చల్లగా ఉంటాయి వేడెక్కిపోకుండా ఉంటాయి కాబట్టి మీరు ఈ విధంగా కూడా చేయొచ్చు. అప్పుడు చల్లగా వాటర్ ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version