కాకరకాయ జ్యూస్‌ తాగితే అందం ఆరోగ్యం రెండు పెరుగుతాయి తెలుసా..?

-

నిజం అయినా మంచి అయినా చేదుగానే ఉంటుంది అంటారు.. అవును ఆరోగ్యానికి ఏది మంచిదో అది మనకు నచ్చదు. కాకరకాయ అంటే చాలా మందికి పెద్దగా ఇష్టం ఉండదు. అది చేదుగా ఉంటుంది.. ఎలా తింటారు అనుకుంటారు.. అదే కాకరకాయతో జ్యూస్‌ చేసుకోని తాగమంటే ఇంకేమైనా ఉందా..?..కానీ మీకు తెలుసా..? కాకరకాయ జ్యూస్‌ తాగితే ఎన్ని ప్రయోజనాలో.. ఆరోగ్యానికి ఎంత మంచిదో..! కాకరకాయలో ఐరన్, పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం, ఫోలేట్, జింక్, ఫాస్పరస్, మాంగనీస్, డైటరీ ఫైబర్, కాల్షియం ఉన్నాయి. కాకరకాయ రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

కాకరకాయ రసం తాగడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. కాకరకాయలో ఉండే కొన్ని ప్రొటీన్లు దీనికి సహాయపడతాయి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు కాకరకాయ రసం తాగొచ్చు.

విటమిన్ సి పుష్కలంగా ఉండే కాకరాకయ జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

కాకరకాయ అధికంగా ఉండే కూరగాయ. కాబట్టి కాకరకాయ రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

కాకరాయ కాలేయాన్ని టాక్సిన్స్ లేకుండా ఉంచుతుంది. ఇది కాలేయ ఎంజైమ్‌లను పెంచి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాకరకాయ రసాన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు.

తక్కువ క్యాలరీలు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే కాకరకాయ జ్యూస్ తాగడం కూడా బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది.

విటమిన్ ఎ మరియు సి పుష్కలంగా ఉండే కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి కాకరకాయ రసాన్ని రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చుకోవచ్చు.

ఇది మాములు కూరగాయల జ్యూస్‌ తాగినంత ఎక్కువగా తాగనవసరం లేదు.. కేవలం ఒక షార్ట్‌ అంటే..అందులో నిమ్మరసం కావాలంటే తేనె కూడా వేసుకోని తాగొచ్చు.. మొదటి రెండు రోజులు కాస్త చేదుగా అనిపిస్తుంది అంతే.. ఆ తర్వాత మీకే అలవాటు అవుతుంది. మలబద్ధకం సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది. రుచితో సంబంధం లేదు ఆరోగ్యానికి మంచిదైతే చాలు అనుకునేవాళ్లు హ్యాపీగా ఈ కాకరకాయ జ్యూస్‌ తాగేయొచ్చు.!

Read more RELATED
Recommended to you

Exit mobile version