‘కొంబుచా టీ’.. తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..!!

-

చాలా మంది బెడ్‌ ఖాఫీతోనే డే స్టాట్‌ చేస్తారు. ఇంకొందరు టీ తాగుతుంటారు. ఇలా ఏదో ఒకటి ఉదయం పొట్టలో పడితేనే బుర్ర పనిచేస్తుంది..లేకపోతే ధ్యాస అంతా ఛాయ్‌ మీదకే పోతుంది.. అయితే వీటివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిసి కూడా మనం ఈ కాఫీలు, టీలకు బానిసలైపోతున్నాం.. ఇదే ప్లేస్‌లో మాంచి…టేస్టీ హెల్తీ టీ తాగితే.. అటు ఆరోగ్యం, ఇటు ఆనందం రెండూ వస్తాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక టీని చాలామంది తాగుతున్నారు. అదే కొంబుచా టీ (Kombucha tea). దీన్ని ఎవరు తయారు చేశారో తెలియదు కానీ.. అధికసంఖ్యలో జనాభా ఈ టీకు అలవాటు పడ్డారు. ఆన్‌లైన్‌లో కూడా టీ పౌడర్‌ దొరుకుతుంది.. ఎందుకు ఈ కొంబుచా టీ కి అంత గిరాకీ ఉంది..? ఏంటా ప్రయోజనాలు మనమూ చూద్దామా.!

ఈ పులియబెట్టిన పానీయాన్ని తాగేందుకు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ అంతా ఆసక్తి చూపిస్తున్నారు. కొంబుచా అనేది ఎసిటిక్ యాసిడ్ బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, బ్లాక్ టీ, ఈస్ట్‌లతో తయారవుతుంది. ఈ రుచికరమైన ప్రోబయోటిక్ డ్రింక్‌ని తయారుచేసే ప్రక్రియను పులియబెట్టడం అని కూడా అంటారు. ఇక ఈ టీ లాభాల విషయానికి వస్తే..

ప్యాంక్రియాస్, కాలేయం, మూత్రపిండాలతో సహా వివిధ అవయవాలను రక్షించడంలో ఈ టీ సహాయపడుతుందని ఓ అధ్యయనంలో తేలింది.

లాక్టోబాసిల్లస్ వంటి డ్రింక్‌లో ఉండే వివిధ బ్యాక్టీరియా కడుపు ఇన్ఫెక్షన్లు, వాపులను నివారిస్తుంది. అంతేకాదు, క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పోరాడే లక్షణాలు కొంబుచా టీలో ఉంటాయని ఒక పరిశోధనలో తేలింది.

చురుకైన జీవనశైలి సాగించేవారు.. ఈ డ్రింక్ రోజూ సేవిస్తే కొన్ని అధిక బరువు నుంచి విముక్తి పొందవచ్చు.

కొంబుచా జీర్ణక్రియను చురుకుగా ఉంచుతూ అరుగుదల శక్తిని పెంచడంలో దోహద పడుతుంది. తద్వారా గుండె జబ్బులు రావు. ఈ డ్రింక్ రోజూ తీసుకుంటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని ఈ టీపై చేసిన పరిశోధనలో తేలింది.

అసలు ఈ మలబద్ధకం అనేది ఈరోజుల్లో చిన్నాపెద్దా తేడా లేకుండా అందర్ని తెగ ఇబ్బంది పెడుతుంది. కడుపునిండానే తింటాం అయినా జీర్ణంకాదు. నేడు ఎంతోమంది సరిగ్గా మోషన్‌ ప్రక్రియ జరగక బాత్రూమ్‌లో ముక్కుతూ పెద్ద ఉద్యయమే చేస్తున్నారు. ఈ పానీయంలోని వివిధ అమైనో ఆమ్లాలు కడుపు pH స్థాయిలను సమతుల్యం చేస్తాయి. తద్వారా, మలబద్ధకం సమస్య ఉండదు.

పేగుల ఆరోగ్యానికి మంచిది. కొంబుచాలో అనేక యాసిడ్స్‌, విటమిన్లు, కొన్ని హైడ్రోలైటిక్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలానే పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములను చంపుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version