సహజంగా పిల్లలకు ఆటల పై దృష్టి ఎక్కువగా ఉంటుంది మరియు చదువు గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోరు. ఎప్పుడైతే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుందో పిల్లల ఏకాగ్రత కూడా పెరుగుతుంది దాంతో చదువు గురించి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వాస్తు శాస్త్రంలో చెప్పిన విషయాలను ఎప్పుడైతే పాటించడం ప్రారంభిస్తారో కేవలం ఆర్థిక సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం మాత్రమే కాకుండా విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తిని పెంచడానికి కూడా ఈ నియమాలు ఉపయోగపడతాయి. కనుక వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలను తప్పకుండా పాటించండి. ఎప్పుడైతే ఈ మార్పులను సోమవారం లేక ఆదివారం పాటిస్తారో విద్యార్థులు చదువు పై మరింత శ్రద్ధ పెడతారు.
చదువుకునే పిల్లలకు ప్రతిరోజు తులసి ఆకులను ఇవ్వాలి. వీటిని తినడం వలన మెదడు ఆరోగ్యం మరింత బాగుంటుంది. దీంతో చదువు పై ఆసక్తి కూడా వస్తుంది. పిల్లలు ఉండేటువంటి గదిలో సరస్వతి దేవి యంత్రాన్ని పెట్టాలి. దీనివలన ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దాంతో పిల్లలు చదువు పట్ల ఎక్కువ ఏకాగ్రత చూపిస్తారు. సరస్వతి దేవి యంత్రాన్ని సోమవారం లేక ఆదివారం రోజున పెట్టడం వలన మరింత ఉపయోగం ఉంటుంది. దీంతో పాటుగా ఇంట్లో వినాయకుడు, విష్ణుమూర్తి లేక కార్తికేయుడు ఫోటోలను పెట్టాలి. వీటిని ఇంట్లో పెట్టడం వలన పిల్లల చదువు పట్ల ఎంతో ప్రభావం ఉంటుంది.
ముఖ్యంగా చదువు పై మరింత ఆసక్తి వస్తుంది. ఇటువంటి మార్పులను చేయడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. అదే విధంగా పిల్లలు చదువుకునే గదిలో మంచి రంగులతో ఉండాలి. లేత ఆకుపచ్చ లేదా లేత బ్రౌన్ కలర్ వంటి రంగులను పిల్లల గదిలో ఉండే విధంగా చూడాలి. దీని వలన ఎంతో ప్రసాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది, ఈ విధంగా చదువుపై ఆసక్తి పెడతారు. రంగులు మాత్రమే కాకుండా పిల్లలకు ఆదర్శంగా ఉండేటువంటి ఫోటోలను లేక పోస్టర్లను పెట్టాలి. ఈ విధంగా మార్పులను చేయడం వలన పిల్లలకు చదువు పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు మరియు ఏకాగ్రత కూడా పెరుగుతుంది. దీంతో వారి భవిష్యత్తు బాగుంటుంది.