బరువు తగ్గే ప్రయత్నంలో ఈ పొరపాట్లు చేస్తే మొదటికే మోసం..!

-

బరువు పెరిగిపోతున్నాం అనే థాట్ కూడా ఎవరికి ఇష్టం ఉండదూ.. ఇక అధిక బరువున్న వారికైతే.. పాపం చాలా డిప్రస్ ఫీల్ అవుతారు. లావుగా ఉన్న ప్రతిఒక్కరు బరువు తగ్గాలనే అనుకుంటారు. కానీ వారు చేసే ప్రయత్న లోపాల వల్ల ఫలితం ఉండటం లేదు. అయితే కొందరు కఠోరదీక్ష చేసినట్లు కడుపు మాడ్చుకుని ఏవేవో చేస్తుంటారు. బరువు తగ్గడం అనేది.. పసిపిల్లలను పెంచడంతో సమానం. వాళ్లను మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి..కంటికిరెప్పలా కాపడుకోవాలి.. బరువు తగ్గడం కూడా అంతే.. జాగ్రత్తగా ఒక ప్లానింగ్, పద్దతితో ముందుకెళ్లాలి.. ఎడాపెడా ఎక్సర్ సైజులు, కడుపుమాడ్చుకోవడాలు చేస్తే.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఈరోజు మనం కొన్ని చిట్కాల ద్వారా బరువును క్రమపద్దతిలో ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం.
ఎంత చక్కటి వర్కవుటైనా… ఇన్నిసార్లు… ఇంతసేపు చేయాలనే నియమం ఉంటుంది. అలా కాకుండా త్వరగా బరువు తగ్గాలని కదా టైమ్ తో పనిలేకుండా.. మితి మీరి వర్కవుట్లు చేస్తే అనారోగ్యాల బారిన పడతారు. కాబట్టి క్రమపద్ధతిలో చేయాలి. మధ్య మధ్యలో విరామం ఇవ్వాలి.
ముందు మన మైండ్ లో బరువు తగ్గాలని గట్టిగా ఫిక్స్ అవ్వాలి. మనసును కోరికలమీదకు పోనియకుండా కంట్రోల్ చేసుకోవాలి. తినే తిండిపైనా, చేసే వర్కవుట్ లపైనా కచ్చితమైన నిబద్ధత కావాలి. ఆహారం సరైన సమయానికి తినడంవల్ల ఆరోగ్యం బావుంటుంది. ఓ టైమ్ టేబుల్ ప్రకారం తినడం వల్ల వెయిట్ ను కంట్రోల్ చేయొచ్చని చాలా మంది వైద్యులు అంటుంటారు. కరెక్టుగా ఒక టైం టేబులు పెట్టుకుని.. ఎట్టిపరిస్థితుల్లో అదే టైంకి తినేట్లు ప్లాన్ చేసుకోవాలి. నైట్ అన్నం మానేసి ప్రూట్స్ , డ్రైనట్స్ ను ఎర్లీగా తినటం అలవాటు చేసుకోవాలి. మార్నింగ్ వెజిటబుల్ జ్యూస్, స్ప్రౌట్స్, ఎండువిత్తనాలతో బ్రేక్ ఫాస్ట్.. మధ్యాహ్నం పుల్కాలు, కొద్దిగా రైస్, ఎక్కువగా కూరతో లంచ్ ప్లాన్ చేసుకోండి. ఇంకోటి.. బరువు తగ్గాలనుకునేవారు.. ఉప్పు మానేస్తే..రిజల్ట్ బాగుంటుదట. ఇదే విషయాన్ని సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేశారు.. కాబట్టి.. వీలైనంత వరకూ ఉప్పుకు దూరంగా ఉండండి.
వెయిట్ తగ్గాలనుకునేవారు ఉదయాన్నే లేవడం చాలా మంచి విషయం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గొచ్చు. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. దీని వల్ల ఎన్నో లాభాలే కాక ఇతర రోగాలు రాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఆహారంలో మరింత ఎక్కువగా దోసకాయ , పొట్లకాయను చేర్చాలి. డైలీ గుమ్మడికాయ రసం తాగవచ్చు. దోసకాయ, గుమ్మడికాయలో కేలరీలు చాలా తక్కువ , ఫైబర్ అధికంగా ఉంటుంది.
ఉదయాన్నే లేచాక.. ఒకటి లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగడం వల్ల కూడా బరువు తగ్గొచ్చు. వాటర్ తాగడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది. వాటర్ ఎక్కువ తాగడం వల్ల కేలరీలు ఎక్కువ బర్న్ అవుతాయి. 500 ml నీళ్లు తాగడం వల్ల శరీరంలో మెటాబాలిక్ రేటు 30 శాతానికి పెరిగిందని ఓ అధ్యయనంలో తేలింది. కాబట్టి వాటర్ బాగా తాగేందుకు ప్రయత్నించండి. అలాగే మోషన్ కు కూడా డైలీ రెండు సార్లు వెళ్లేలా చూసుకోవాలి. జీర్ణక్రియ బాగుంటేనే ఈజీగా బరువు తగ్గొచ్చు.
ఈ పద్దతులు ద్వారా బరువును రెండు మూడు నెలల్లో తగ్గించుకోవచ్చు. అయితే మీరు ఏదైనా స్టాట్ చేసిన వెంటనే రిజల్ట్ రావాలని అనుకోవడం మానేయండి. చాలామంది.. మూడురోజులు చేసి చల్.. కేజీ కూడా తగ్గలేదు వేస్ట్ అని వదిలేస్తారు. కనీసం 21రోజులు చేయాలి.. అప్పుడే ఆ ఫలితం కంటికి కనిపిస్తుంది. అందుకే మన పెద్దోళ్లు దీక్షలు కూడా 21రోజులు చేసే కాన్సప్ట్ పెట్టారు. అన్నీ డేస్ చేస్తేనే.. ఏదైనా సరే అలవాటు అవుతుందట.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version