తీవ్రమైన ఆర్థిక, ఆహర సంక్షోభంలో కూరుకుపోయింది శ్రీలంక. ఇతర దేశాలను సహాయం కోరుతోంది. శ్రీలంక పరిస్థితులపై ఆదేశ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ శ్రీలంక స్టార్ క్రికెటర్ అర్జున రణతుంగ. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తమ స్వలాభం కోసం మొత్తం రాజ్యాంగాన్నే మార్చేసిందని అన్నారు. భారత్ మాకు పెద్దన్నయ్య లాంటిదని… ఇండియా మా దేశానికి పెట్రోల్, మందులు వంటి అవసరాలను తీరుస్తున్నారని అన్నారు. భారత్ మాకు బాగా సాయపడుతుందని అన్నారు. శ్రీలంకలో సామాన్యులు తమ ప్రాథమిక విషయాలైన పాలపొడి, గ్యాస్, బియ్యం, పెట్రోల్ వంటివే అడుగుతున్నారని ఆయన అన్నారు.