Chanakya Nethi : చాణక్య ఎన్నో విషయాల గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం అద్భుతంగా ఉంటుంది. చాణక్య ఇలాంటి సందర్భాల్లో మౌనంగా ఉంటేనే మంచిదని విజయాన్ని సాధించవచ్చు అని అన్నారు. మరి చాణక్య చెప్పిన దాని గురించి ఇప్పుడే చూసేద్దాం. తెలివైన వాళ్ళు ఎక్కువగా వింటారు. తక్కువగా మాట్లాడుతారు. మౌనం చాలా గొప్ప కళ. కొన్నిసార్లు మాట్లాడటం వలన నష్టం జరుగుతుంది. అలాంటప్పుడు మౌనంగా ఉండడం మంచిది. చాణక్య నీతి ప్రకారం కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటమే మంచిదట.
ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు గొడవతో మీకు ఎలాంటి సంబంధం లేకపోతే అందులో జోక్యం చేసుకోవద్దు దీని వలన మీకు ప్రమాదం ఉంది. ఒకరు తమ గొప్పతనం గురించి చెప్పుకుంటుంటే మీరు మౌనంగా ఉండడమే మంచిది. ఒకవేళ వాళ్ళ మాటలకు భంగం కలిగిస్తూ మీరు మాట్లాడితే ఖండించినట్లు అవుతుంది. జలసీగా ఫీల్ అవుతారని అవతలి వ్యక్తికి అనిపిస్తుంది. అలాగే ఎవరికైనా మీ మీద కోపం వస్తే వారి కోపం మౌనంగా ఎదిరించాలి అంటే ఏమీ మాట్లాడకూడదు. ఇలా చేస్తే కోపం తగ్గుతుంది. ఏదైనా ఒక విషయం గురించి పూర్తిగా తెలియకపోతే దాని గురించి మాట్లాడకుండా ఉండడమే మంచిది.
లేదంటే హాఫ్ నాలెడ్జ్ కారణంగా అనుకోకుండా వేరే వారికి నష్టం కలగవచ్చు. ఒకరు మరొకరు గురించి చెడుగా మాట్లాడుతున్నట్లయితే మీరు కూడా అందులో పాల్గొనవద్దు. ఈరోజు వాళ్ల గురించి మాట్లాడతారు. రేపు మీ గురించి మాట్లాడుకోవచ్చు. ఎవరైనా మీతో వాళ్ళ సమస్యల్ని పంచుకుంటున్నట్లయితే వారి మాటలను జాగ్రత్తగా వినాలి. వారికి సరైన సలహా ఇవ్వడానికి ముందు కాసేపు ఆలోచించాలి. ఏ విధంగాను సంబంధం లేని విషయంలో మీరు మాట్లాకుండా మంచిది. అనవసరంగా మాట్లాడటం వలన గొడవలు జరుగుతాయి.