కలలకు సంబంధించి కొన్ని నిజాలు మీరు తప్పక తెలుసుకోవాలి. మన మనసులోని భావాలే కల రూపంలో వస్తాయని విశ్లేషిస్తున్నారు. వాటి గురించి కొన్ని నిజాలని తెలుసుకుందాం. తలలో హఠాత్తుగా కింద పడిపోయినట్లు, ఎక్కడి నుంచో తోసేస్తున్నట్లు కల వచ్చిందంటే అభద్రత భావాన్ని ఏదో కోల్పోతున్న తత్వాన్ని, భయాన్ని సూచిస్తుంది. అలాగే కలలో ఎవరైనా మిమ్మల్ని వెంటాడుతున్నట్లు వస్తే మీరు ఏదో సవాలును అధికమించడానికి ప్రయత్నం చేస్తున్నారని అర్థం. ఓ పరిస్థితిని అధికమించడానికి ఇబ్బంది పడుతున్నారని సూచన.
అలాగే కలలో పన్ను రాలినట్లు కనబడితే శక్తిని కోల్పోతున్నారేమో అనే భయాన్ని సూచిస్తుంది. జీవితంలో బాధ్యతలు బంధాలు బరువులలో కూరుకుపోయినప్పుడు నీటిలో మునిగిపోతున్నట్లు కల వస్తుంది. ఆలస్యం అయిపోవడం వంటి కలలు అవకాశాన్ని కోల్పోతున్నట్లు మిస్ అవుతున్న ఫీలింగ్ ని సూచిస్తుంది. భవిష్యత్తు లో రాబోయే సవాళ్లకు సిద్ధంగా లేనట్లు కూడా దానికి అర్థం.
అలాగే ప్రియమైన వాళ్ళతో దూరంగా ఉన్నట్లయితే అభద్రతతో కూడిన ఆలోచనలు వలన కలలు వస్తాయట. అలాగే బంధించినట్లు కల వచ్చిందంటే వ్యక్తిగత ,వృత్తిపరమైన జీవితంలో వివిధ పరిస్థితులు వలన ఇష్టం లేకుండా ఉండాల్సి ఉన్నప్పుడు ఇటువంటివి వస్తాయి. ఇలా మీ నిజజీవితంలో వచ్చే పరిస్థితులు బట్టి ఇలాంటి కలలు వస్తాయి.