ఉల్లిపాయలే కాదు.. ఉల్లిపొట్టుతో కూడా ప్రయోజనాలు..?

-

మన వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే వాటిలో ఉల్లిపాయలు కూడా ఒకటి. ఈ ఉల్లిపాయలను ఎక్కువగా ఏదైనా పోపు వేయడానికి అందులో ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే రైతా లో కలుపుకొని కూడా వీటిని తాగుతూ ఉంటాము. ఈ ఉల్లిపాయలలో ఉన్న పోషకాల గురించి మన పూర్వీకులు చాలానే చెబుతూ ఉంటారు. ఎందుచేత అంటే ఉల్లిపాయలోనే కాదు ఉల్లి పొట్టులో కూడా పలు పోషకాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

సాధారణంగా ఎక్కువగా ఉల్లిపాయలు కొనేటప్పుడు అందరూ పొట్టు తీసేసి తీసుకుంటూ ఉంటారు. కానీ ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఉల్లిపాయలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దీనివల్ల మన శరీరానికి చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి కూడా ఈ ఉల్లిపాయలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయని చెప్పవచ్చు.

ఉల్లిపాయలలో ఎక్కువగా ఫోలేట్ అనే పోషకం ఉండటం వల్ల ఎవరైనా నిద్రలేని సమస్యతో బాధపడుతున్న వారు వీటిని తినవచ్చు. ఉల్లిపొట్టులో పలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించడం వల్ల కండరాల నొప్పితో ఇబ్బంది పడేవారు వీటిని తీసుకోవడం మంచిది. ఉల్లిపొట్టుతో డికాషన్, టీ చేసుకోవడం వల్ల ఇలాంటి వాటికి ఉపశమనం కలుగుతుందని నిపుణులు తెలియజేయడం జరుగుతుంది.

మనం ఏదైనా పని చేస్తూ అలసిపోయినట్లు అయితే ఉల్లిపాయ పొట్టును తీసుకొని గోరువెచ్చని నీటిలో వేసి.. ఉడికించి ఆ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం లభిస్తుందట. ఉల్లిపొట్టు మన చర్మం పై ,పాదాల పైన వచ్చే దురదలను కూడా తగ్గిస్తుంది. ఇందులోని విటమిన్ ల వల్ల మన కంటికి చాలా మేలు చేస్తుంది. ఉల్లిపాయ పొట్టుతో టీ చేసేటప్పుడు అందులోకి కాస్త తేనె వేసుకోవడం వల్ల రుచి తగులుతుంది. ఆ తర్వాత తాగడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news