ఎలక్ట్రిక్ షాక్ లాంటి లక్షణాలను ఎదుర్కొంటే.. జీవన విధానంలో ఈ మార్పులను చేయాల్సిందే..!

-

కొంతమంది ఇతరులను ముట్టుకున్నప్పుడు షాక్ వచ్చినట్టు అనుభూతి పొంది భయపడతారు. అయితే ఇటువంటి అనుభూతిని చాలా శాతం మంది పొందుతారు. దాని వెనుక ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. సహజంగా చాలా మందికి దీనికి సంబంధించిన కారణాలు తెలియకపోయినా, ఇతరులను ముట్టుకున్నప్పుడు షాక్ వచ్చిన అనుభూతి కలగడానికి సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. ఇటువంటి అనుభూతిని మగధీర సినిమాలో హీరో, హీరోయిన్ మధ్యన చూపించడం జరిగింది. అదేవిధంగా నిజ జీవితంలో కూడా కొంతమంది ఇటువంటి అనుభూతిని పొందుతారు.

ఈ సమస్య వెనుక కారణం నరాలు మెదడు నుండి శరీర భాగాలకు సిగ్నల్స్ ను ఆలస్యంగా పంపడమే. అటువంటి సమయంలో నరాలు దెబ్బతిన్నా లేదా సరిగ్గా పనిచేయకపోయినా, తప్పుడు సిగ్నల్స్ చేరుతాయి. దాంతో ఇటువంటి అనుభూతిని ఎదుర్కొంటారు. ఈ అనుభూతి కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటుంది. కానీ కొంతమందిలో ఎక్కువసేపు ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కొన్ని జాగ్రత్తలను పాటించాలి. శరీరంలో విటమిన్ బి12 ఎక్కువగా లేనప్పుడు రక్తంలో ప్లేట్లెట్స్ తయారీ దెబ్బతింటుంది మరియు నరాల ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. కనుక మెదడు పనితీరు బాగుండాలంటే, మీ రోజు వారి ఆహారంలో భాగంగా గుడ్లు, పాలు, సాల్మన్, మాంసం వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి.

అదే విధంగా, విటమిన్ బి12 పోషక లోపంతో పాటు డయాబెటిస్, సయాటికా, వెన్నెముక గాయాలు, ఇన్ఫెక్షన్లు వంటి ఇతర కారణాల వలన కూడా ఈ సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. కనుక, సరైన మెడికేషన్ ను తీసుకుని ఆరోగ్యం పై జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా, శాకాహారులు విటమిన్ బి12 లోపంతో బాధపడుతూ ఉంటారు. కనుక మెడికేషన్ ద్వారా విటమిన్ బి12 శరీరానికి అందించడం వల్ల నరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనికి సంబంధించి సరైన ట్రీట్మెంట్ ను సకాలంలో ప్రారంభించడం వలన ఈ సమస్య లక్షణాలను తగ్గించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news