తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అందాల పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అందాల పోటీలను చాలా ప్రతిష్టాత్మకంగా కొనసాగి స్తోంది. ఈనెల చివరి వరకు ఈ అందాల పోటీలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో నే అందాల భామలు డిజె పాటలకు స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలంగాణ డీజే పాటలను.. ఒక కార్యక్రమంలో పెట్టగా… వాటికి ఎగిరి గంతులు వేశారు అందాల భామలు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా ఈ అందాల భామల కాళ్లు కడిగించారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పలేక… చిక్కులో పడిపోయింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.