బిడ్డకు జన్మనిచ్చిన తరువాత..మహిళల్లో జుట్టు రాలిపోవడానికి కారణాలు ఇవే..!

-

గర్భిణీ స్త్రీల ఆరోగ్యం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ముఖ్యంగా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వారి శరీరంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. వాటిలో జుట్టు రాలడం కూడా ఒకటి. ప్రసవం తర్వాత శారీరకంగా ఎన్నో మార్పులు జరుగుతాయి. పైగా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అటువంటి మార్పులలో జుట్టు రాలిపోవడం సమస్య కూడా ఒకటి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. నిపుణుల ప్రకారం సుమారు 42 నుండి 50 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటారని చెబుతున్నారు. సహజంగా గర్భిణీ స్త్రీలు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మూడు నుండి ఐదు నెలల తర్వాత జుట్టు రాలడం సమస్య ప్రారంభమవుతుంది.

దీనికి కారణం ఒత్తిడి, హార్మోన్ల మార్పులు మరియు పోషకాహార లోపం. శరీరంలో ఎన్నో మార్పులు జరగడం వలన ఈ సమస్య ఎదురవుతుంది. ముఖ్యంగా ప్రసవం తర్వాత ఎంతో ఒత్తిడికి గురవుతారు. ఎప్పుడైతే ఒత్తిడి ఎక్కువ అవుతుందో, కార్టిసోల్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. దీంతో జుట్టు రాలడం ఎక్కువ అవుతుంది. కనుక ఒత్తిడి తగ్గే విధంగా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. అంతేకాకుండా ఇతర కారణాల వలన జుట్టు విపరీతంగా రాలినట్లయితే, ఆహారంలో భాగంగా ప్రోటీన్, కాల్షియం, ఇనుము, బీటా కెరోటిన్ వంటి మొదలైన పోషకాలు ఉండేటువంటి ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి.

ఈ విధంగా పోషక విలువలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన జుట్టు రాలడం సమస్యను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా కాల్షియం ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకోవాలి. కాకపోతే ఖాళీ కడుపుతో కాల్షియం ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు అని నిపుణులు చెబుతున్నారు. కనుక టీ, కాఫీ వంటివి తీసుకోకపోవడమే మేలు. జుట్టు ఎదుగుదల కోసం బాదం, కొబ్బరి, బృంగరాజ్ వంటి నూనెలను ఉపయోగించి జుట్టును మసాజ్ చేయాలి. ఈ విధంగా మసాజ్ చేయడం వలన రక్త ప్రవాహం పెరుగుతుంది. దీంతో జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. కనుక ఇటువంటి జాగ్రత్తలను పాటిస్తే, ప్రసవం తర్వాత జుట్టుకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news