ఉప్పు వల్ల బరువు పెరుగుతారని చెబుతున్న తాజా పరిశోధనలు..తగ్గాలంటే మానాల్సిందే..!

-

ఉప్పు తింటే బరువు పెరుగుతారని వైద్యులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కానీ మనకు ఉప్పులేకుండా ఏ వంట చేయబుద్ది కాదు. ఉప్పుకు కాస్త ప్రత్యామ్నాయాలు కొన్ని ఉన్నప్పటికీ వాటిని వాడుకునేందుకు మనకు ఇంట్రస్ట్ ఉండదు. ఉప్పు వల్ల బరువు పెరగడమే కాదు.. బాడీలో కాల్షియం లోపించి.. ఎముకలు బలహీనం అవుతాయి.,అధిక రక్తపోటు సమస్య కూడా వస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా..మనం వినం..అనుభవంలో తెలుసుకుంటేనే అందరికి అర్థమవుతుంది. ఉప్పు మానేస్తే బరువు త్వరగా తగ్గొచ్చు. నమ్మడం లేదా.. ఇదే విషయాన్ని సైంటిఫిక్ గా రెండు యూనివర్శిటీలు నిరూపించాయి. అవేంటో, ఎలా తగ్గుతారో చూద్దాం.

లెప్టిన్ రెసిస్టెన్స్ (Leptin Resistance) సాల్ట్ తీసుకొస్తుందని ఒక యూనివర్సిటి కనుగొంది. లెప్టిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే.. తీసుకున్న ఆహారం ఎక్కువైందంటే.. అది కొవ్వుగా మారి కొవ్వు కణాల్లో పేరుకుంటుంది. కొవ్వు ఎక్కువగా నిల్వలో ఉన్నప్పుడు ఆహారం ఎక్కువగా అవసరం ఉండదు. సో మనకు ఆకలి వేయకుండా ఉండాటానికి ఆటైంలో హంగర్ సెటైటీ ( Hunger satiety) అనే హార్మోన్ ను రిలీజ్ చేస్తుంది. ఆకలి తగ్గించే హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. దీన్నే లెప్టిన్ హార్మోన్ అంటారు. కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది రిలీజ్ అవుుతంది. అప్పుడు బరువు పెరగరు, తిండి మీద వాంఛ తగ్గిపోతుంది. కానీ ఈ హార్మోన్ సాల్ట్ వల్ల పనిచేయకుండా అయిపోతుంది. దాన్నే లెప్టిన్ రెసిస్టెన్స్ అంటారు. ఈ విషయాన్ని 2018 వ సంవత్సరంలో యూనివర్శిటీ ఆఫ్ కొలరాడే యూస్ఏ ( University Of Colorado)వారు కనుగొన్నారు.

సాల్ట్ తిన్న తర్వాత.. చిన్నప్రేగుల్లోకి, పెద్ద ప్రేగుల్లోకి వెళ్లి అందులో ఉండే బాక్టీరియాను చంపుతుంది. ఉప్పుకు క్రిములను చంపే గుణం ఉంది. అందుకే ఆవకాయలో ఉప్పు తక్కువైతే బూజుపడుతుంది. ఉప్పు తిన్నప్పుడు మన బాడీలో 90% బాక్టీరియా చచ్చిపోతుందని నిరూపించారు. ఇలా జరగడాన్నే డిస్ బయోసిస్(Dysbiosis) అంటారు. బాక్టీరియా చచ్చిపోతే మంచిదే కదా..బరువు ఎందుకు పెరుగుతున్నా అనే డౌట్ రావొచ్చు..బాక్టీరియాలు బ్రతకడానికి గ్లూగోజ్ ను తింటాయి.

మనం తిన్న ఆహారంలో ఎక్కువ భాగం గ్లూగోజ్ ను కూడా ఈ బాక్టీరియాలు తినేసి కొన్ని ఉపయోగపడే మంచి పనులు చేస్తాయి విటమిన్ K, విటమిన్ b12 ను తయారు చేయడం చేస్తాయి. రక్షణ వ్యవస్థను యాక్టీవ్ గా చేస్తాయి. మనం సాల్ట్ ఎక్కువగా తినటం వల్ల ఈ బాక్టీరియాలు చచ్చిపోతున్నాయి. గ్లూగోజ్ ఎక్కువైపోయి.. అది రక్తంలోకి వెళ్లి..మళ్లీ ఫ్యాట్ కింద మారి బరువు పెరుగుతున్నారు అని 2017వ సంవత్సరంలో నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ హెల్త్ యూఎస్ఏ( National Institute of Heath) వారు నిరూపించారు.

పిల్లలకు ఊబకాయం రావడానికి కూడా వారు తినే జంక్ ఫుడ్స్.. అందులో సాల్ట్ విపరీతంగా వాడతారు. అందుకే పిల్లలు స్పీడ్ గా వెయిట్ పెరుగుతున్నారు. కాబట్టి దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు మాత్రమే కాదు.. అందరూ కూడా సాల్ట్ ను మానేయడం ఉత్తమం. ఉప్పు లేని ఆహారాలు తినడానికి అలవాటు చేసుకుంటే..స్లిమ్ గా హెల్తీగా ఉండే బాడీ కచ్చితంగా వస్తుంది అంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు. ఎప్పుడో పండగలకు, వీకెండ్లకు మంచి వంటలు చేసుకుని తినొచ్చు. మిగతా టైంలో ఉప్పను పక్కన పెట్టడమే ఉత్తమం.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version