ఒంట్లో వేడిని ఇలా ఈజీగా తగ్గించుకోండి..!

-

చాలా మందికి శరీరంలో ఎక్కువ వేడి ఉంటుంది. అయితే మనం తీసుకునే ఆహారం జీవన విధానాన్ని బట్టి మనం ఆ వేడిని తగ్గించుకోవచ్చు. శరీరంలో వేడిని మెదడులోని హైపోథాలమస్ నియంత్రిస్తుంది. అధిక వేడి శరీరంలో ఉండటం వల్ల తలనొప్పి మలబద్ధకం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ రోజు శరీరంలో వేడిని ఎలా తగ్గించుకోవచ్చు అనేది తెలుసుకుందాం మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం పూర్తిగా చూసేయండి.

 

శరీరంలో వేడి తగ్గాలంటే శరీరం డీహైడ్రేట్ అవ్వాలి. మనకి నీళ్లు చాలా అవసరం. వేడిని తగ్గించడానికి కూడా నీళ్లు ముఖ్యం. కనుక ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండండి. ఇలా నీళ్లు తాగడం వల్ల ఉష్ణోగ్రత కంట్రోల్ అవుతుంది.

అదే విధంగా మెంతులు కూడా వేడిని తగ్గిస్తాయి. ఒక స్పూన్ మెంతులు తినండి లేదు అంటే మెంతుల పొడిని ఒక గ్లాసు నీళ్లలో వేసుకుని తాగండి. ఇలా కూడా వేడిని తగ్గించుకో వచ్చు. అలానే చెయ్యి మరియు ఛాతి భాగం లో చల్లని నీళ్లు కానీ ఐస్ కానీ రాస్తే ఉపశమనం లభిస్తుంది.

థైరాయడ్ ఎక్కువ యాక్టివ్ గా ఉంటే శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది. దీనితో గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది. ఎక్కువ చెమటలు పట్టడం జాండీస్ కూడా దీని వల్ల వస్తుంది. కాబట్టి శరీరంలో వేడిని తగ్గించుకోవడం కోసం ఈ పద్ధతులుని ఫాలో అయ్యి ఆరోగ్యంగా ఉండండి. సమస్యలకు దూరంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version