అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. వాటికోసం..రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. చర్మం మెరిసిపోవడానికి ఇంటి చిట్కాలు, మార్కెట్లో ఉండే క్రీమ్స్ ఇలా ట్రై చేస్తారు. ఇవి ఒకఎత్తు అయితే అవాంఛితరోమాలు తీసుకోవటం మరో ఎత్తు. బ్యూటీ పార్లర్ లో వీటిని తీసేయాడనికి వేలకు వేలు డబ్బులు తీసుకుంటున్నారు. ఇలా ఉండే అవాంఛిత రోమాలను తొలగించటం వలన అందం రెట్టింపు అవుతుందని అనుకుంటారు. అవును అది నిజమే..కానీ ఇలాంటివి చేయటం వల్ల ఎన్నో దుష్రభావాలు ఉన్నాయి. ముఖ్యంగా ముక్కులో వెంట్రుకలు తీయటం చాలా ప్రమాదకరమట. ముక్కులో వెంట్రుకల నిజానికి చూడ్డానికి అందవికారంగా ఉంటాయి..కానీ అవి ఉండటం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయట.
ముక్కులో ఏర్పడే వెంట్రుకలను తీసివేయడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా?
అందం కన్నా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముక్కులో ఆ వెంట్రుకలు ఉండటం ద్వారా వాతావరణంలో ఏర్పడే దుమ్ము, ధూళి కణాలను, సూక్ష్మజీవులను ముక్కు ద్వారా శ్వాసనాళంలోకి.. తద్వారా మన శరీరంలోకి ప్రవేశించకుండా ఆపుతాయని వైద్యులు చెబుతూనే ఉన్నారు. ఇదే విషయాన్ని మనమంతా చిన్నప్పుడు స్కూల్లో కూడా తెలుసుకున్నాం. ముక్కులో వెంట్రుకలను పీకినప్పుడు వాటి కుదుళ్ళలో ఏర్పడే రంధ్రాల ద్వారా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ జరిగి రక్త నాళాల్లోకి ప్రవేశిస్తుంది. దీని ద్వారా రక్తం సరఫరా జరిగే సిరులలో రక్తం గడ్డకట్టే అవకాశం కూడా ఉంటుందట. దీనినే ‘కావర్నస్ సైనస్ థ్రోంబోసిస్’ అని పిలుస్తారు. ఇది మెదడుపై అధిక ఒత్తిడిని తీసుకు రావడం వల్ల కొన్నిసార్లు మరణానికి కూడా దారి తీస్తుంది. వామ్మో ఇంత జరుగుతుందా అనిపిస్తుంది కదా..ఏదో నాలుగు వెంట్రుకలే కదా అని పీకీస్తే ఇంత పెద్ద సమస్యలు వచ్చే అవకాసం ఉందట.
ఈ రోజుల్లో ముక్కు వ్యాక్సింగ్ చేయించుకోవడం ట్రెండ్ అయిపోయింది. సోషల్ మీడియాలో ముక్కు వ్యాక్సింగ్‌కు సంబంధించి బోల్డెంత కంటెంట్ ఉంది. వీటిని చూసి కొందరు ముక్కు వ్యాక్సింగ్ చేయించుకుంటున్నారు. ఇలా వ్యాక్సింగ్ చేయించుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ముక్కు వెంట్రుకలు మనం పీల్చే గాలిని ఫిల్టర్ చేస్తాయి. ఈ వెంట్రుకలు గాలిలో ఉండే వైరస్‌లు, బ్యాక్టీరియా, ఇతర వ్యాధులకు కారణమయ్యే వ్యాధికారక క్రిముల నుండి రక్షణ కల్పిస్తాయి. శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ముక్కు వెంట్రుకలు అవసరమని వైద్యలు అధ్యయనంలో తేల్చారు.
1896లో డాక్టర్ల బృందం ప్రతిష్టాత్మక మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’లో వ్యాసాన్ని ప్రచురించారు. దీని ప్రకారం, ముక్కులో కొన్నిసార్లు మొటిమలు కూడా వస్తాయట. ఇవి కాలుష్యం, దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా వల్ల కలుగుతాయి. ముక్కు వెంట్రుకలు తేమతో ఒక ఉచ్చును ఏర్పర్చి ఎలాంటి వైరస్ లేదా బ్యాక్టీరియాను ఊపిరితిత్తులలోకి రాకుండా చేస్తాయి. అందుకని, ముక్కులోని వెంట్రుకలను కత్తిరించినప్పుడు లేదా వ్యాక్స్ చేసినప్పుడు వైరస్, బ్యాక్టీరియా కోసం ఒక క్లీన్ ట్రాక్ వేసినట్లే. అయితే, ముక్కు వెంట్రుకలపై ఇప్పటివరకు కొన్ని అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనాల్లో ముక్కులోని వెంట్రుకలను కత్తిరించడం లేదా వాక్సింగ్ చేయడం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుందని చెప్పటానికి ఎటువంటి ఆధారాలు లభించలేదు.
అందంకోసం చూసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి వ్యాక్సింగ్ కంటే ప్రత్యామ్మాయాలు చేయటం మంచింది. పూర్తిగా తొలగించటం కంటే..ఎక్కువుగా ఉన్న వాటిని కత్తిరించటం కాస్తమేలు. అలా అని కత్తిరంచటం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదా అంటే..కాదు..అసులు వాటిని తీయటమే ప్రమాదం. మీరు ఇలాంటి చేయాలనుకున్నప్పుడు డాక్టర్లను సంప్రదించటం మంచిది.
– Triveni Buskarowthu