గురక సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

-

గురక.. నిద్రలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇది గురకపెట్టే వారి కంటే వారి పక్కనే ఉన్న వారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఇలా నిద్రలో గురక పెట్టే వారు ఎక్కడికైనా వెళ్లాలంటే ఆలోచిస్తారు. ఎందుకంటే అందరి ముందు పరువు పోతుందని. కొన్ని కేసుల్లో అయితే భర్త గురక పెడుతున్నాడని భార్య విడాకులు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. గురక అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. గురక పెట్టడం అనారోగ్యానికి సంకేతమని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని లేకపోతే గుండె సంబంధిత సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు.

గురక రాకుండా ఉండటానికి చాలా మంది రకరకాల చిట్కాలు పాటిస్తారు. కానీ అవేమీ ఫలితాలివ్వవు. మరి దీనికి శాశ్వత పరిష్కారం లేదా.. జీవితాంతం గురకతో బాధపడాల్సిందేనా అంటే అదేం లేదు. దీనికి పరిష్కారాలు కనుగొంటున్నారు శాస్త్రవేత్తలు. అలా తాజాగా అందుబాటులోకి వచ్చిన ఓ సాధనం గురించి తెలుసుకుందామా..

ఫొటోలో కనిపిస్తున్నది అదే! చూడటానికి కెటిల్‌లా ఉంది, దీనితో గురక నివారణేమిటా అనుకుంటున్నారా? నిజమే! ఇది ఎలక్ట్రిక్‌ కెటిలే! అయితే, కాఫీ, టీలు కాచుకునే కెటిల్‌ కాదిది. గురక బాధితుల శ్వాసవ్యాయామాల కోసం ఫిన్లాండ్‌లోని టుర్కు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన కెటిల్‌ ఇది.

‘వెల్‌ ఓ2’ పేరుతో రూపొందించిన ఈ కెటిల్‌ వెలుపలి వైపు ఉండే గొట్టం ద్వారా ఒక్కో విడతకు 10–15 సెకన్ల సేపు గాలి ఊదుతూ వ్యాయామం చేసినట్లయితే, మెడ, ఛాతీ కండరాలు బలపడి గురక బాధ శాశ్వతంగా తప్పుతుందని చెబుతున్నారు. దీని ధర 244.80 డాలర్లు (రూ.19,250) మాత్రమే!

Read more RELATED
Recommended to you

Exit mobile version