ఆయుర్వేదంలో మేధస్సు టానిక్ గా పిలవబడే ఒక శక్తివంతమైన మూలిక బ్రహ్మీ మూలిక. ఆయుర్వేదంలో ప్రసిద్ధమైన నూట్రోపిక్ మూలిక (బ్రహ్మీ ) మరిచిపోయే సమస్యలు, మెదడు ఆరోగ్య సమస్యలకు, సహజ చికిత్సగా ఉపయోగపడుతుంది. ఈ మొక్కలోని బాకో సైడ్స్ అనే సమ్మేళనాలు మెమరీ ఏకాగ్రత, నేర్చుకునే శక్తిని మెరుగుపరిస్తాయని శాస్త్రీయ అధ్యయనాలు సూచించాయి. బ్రహ్మీ యొక్క ప్రయోజనాలు, జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
బ్రహ్మీ మూలిక: ఈ మొక్క తడి ప్రాంతాల్లో చెరువులు, నీటి వనరుల సమీపంలో సహజంగా పెరుగుతుంది. మతిమరుపు సమస్యలు, ఒత్తిడి ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రహ్మీలోని బాకో సైడ్స్ అనే క్రియాశీల సమ్మేళనాలు, మెదడు కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి రక్షిస్తాయి. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. శాస్త్రీయ అధ్యయనాలు ప్రకారం ఈ మూలికను రెగ్యులర్ గా తీసుకోవటం వలన ఏకాగ్రత సామర్థ్యం పెరుగుతుంది.
ఉపయోగాలు: బ్రహ్మీ మూలిక మెదడులోని న్యూరో టాక్స్ మీటర్ కార్యకలాపాలు మెరుగుపరచడం ద్వారా మరిచిపోయే సమస్యను తగ్గిస్తుంది. ఇది పిల్లలు, పెద్దలలో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది అంతేకాక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంకా నిద్రలేమి సమస్యలు తగ్గించి మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది.
తయారీ విధానం: తాజా లేదా ఎండిన బ్రహ్మీ ఆకులను రెండు గ్రాములు వేడి నీటిలో వేసి, పది నిమిషాలు మరిగించి వడగట్టి తాగవచ్చు. రుచికోసం తేనె లేదా నిమ్మరసం జోడించవచ్చు. లేదా బ్రమి పొడిని పాలు లేదా నీటిలో ఒక టీ స్పూన్ జోడించి తీసుకోవచ్చు. మార్కెట్లో బ్రహ్మీ తైలం అందుబాటులో కలదు. ఈ నూనెను తలకు మసాజ్ చేయడం వల్ల మెదడు రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

జాగ్రత్తలు: బ్రహ్మీ ఔషధాన్ని అధికమోతాధిలో తీసుకోవడం వల్ల కడుపులో ఆందోళన, వికారం కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక సమస్యలకు మందులు వేసుకునేవారు ఆయుర్వేద నిపుణులు సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి. తీవ్రమైన మరిచిపోయే సమస్యలకు నూరాలజిస్టును సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం.
వీటితోపాటు మన జీవన ఆహార శైలిలో మార్పులు చేసుకోవాలి. బాదం,వాల్ నట్స్,ఒమేగా-3 వంటి ఆహారాలను తీసుకోవాలి. అంతేకాక యోగాసనాలు, ధ్యానం వలన ఏకాగ్రత మెరుగుపడుతుంది. ముఖ్యంగా రోజుకు ఎనిమిది గంటలు నిద్ర మెదడు ఆరోగ్యానికి ఎంతో అవసరం.
(గమనిక:పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే,ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే డాక్టర్ ను సంప్రదించండి.)