గాడ నిద్రలో చెమటలు పడుతున్నాయా.. జాగ్రత్త ఈ రోగాలకు సంకేతమే..!

-

ఈరోజుల్లో నిద్రపోవడం పెద్ద టాస్క్ అయిపోయింది చాలా మందికి..టైం ఉండి పడుకున్నప్పుడు నిద్రరాదు.. మాంచి డ్యూటీ టైంలో ఓ ఊగిపోతూ ఉంటాం..ఇంకొందరికి.. బాగా గాఢనిద్రలోకి జారుకున్నాకా.. ఫ్యాన్ తిరుగుతున్నప్పటికి బాగా చెమటలు పట్టేస్తాయి.. మనకు వెంటనే మేలుకు వచ్చేస్తుంది. వీలైతే ఇంకాస్త ఫ్యాన్ స్పీడ్ పెట్టుకుని పడుకుంటాం.. అయితే వాటర్ తాగి వస్తాం.. అంతే కానీ..దీని గురించి పెద్దగా పట్టించుకోం.. చాలారోగాలుకు లక్షణాలు అనేవి సంకేతాలు.. అయితే వీటిని గుర్తించేలోపే సమయం చాలా వేస్ట్ అవుతుంది. జబ్బు ముదురుతుంది. నిద్రలో చెమటలు పడుతున్నాయి అంటే.. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకరోజు జరిగితే లైట్ తీసుకోవచ్చు.. కానీ పదేపదే ఇలానే జరుగుతుందంటే ఆలోచించాల్సిందే..

మనం చాలా రోగాలకు వాడే మందులు రాత్రి నిద్రిస్తున్నప్పుడు చెమట పట్టేలా చేస్తాయి. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. ఈ పరిస్థితిని ఇడియోపతిక్ హైపర్ హైడ్రోసిస్ అంటారు. రాత్రి నిద్రిస్తున్నప్పుడు చెమట పట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి.

TB వల్ల చెమట పడుతుంది

మీకు టీబీ వచ్చినా రాత్రిపూట చెమటలు పడుతాయి. ఈ వ్యాధి ఎక్కువగా ప్రభావితమయ్యేది ఊపిరితిత్తులపైనే. ఈ పరిస్థితిలో రోగులు ఖచ్చితంగా చెమట సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి రోగులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సమయంలో బరువు కూడా తగ్గుతుంది.

క్యాన్సర్ వల్ల

మీకు క్యాన్సర్ వచ్చినా రాత్రి నిద్రిస్తున్నప్పుడు చెమటలు పట్టే అవకాశం ఉందట. నివేదికల ప్రకారం.. కొన్ని రకాల క్యాన్సర్లలో రాత్రిపూట చెమటలు పట్టడం జరుగుతుందని తేలింది.. శరీరం క్యాన్సర్‌తో పోరాడుతున్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో రాత్రిపూట జ్వరం, చెమటలు వస్తాయి.

గ్యాస్ సమస్య వల్ల

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి, గ్యాస్ట్రోఇంటెస్టినల్ డిజార్డర్ కారణంగా రాత్రి నిద్రిస్తున్నప్పుడు చెమటలు పడుతాయి. నిజానికి నిద్రిస్తున్నప్పుడు ఆహార గొట్టంలో తయారైన యాసిడ్ కడుపులో పేరుకుపోతుంది. దీని వల్ల ఛాతీలో మంటలు, చెమటలు పడుతాయి.

మీకు తరచూ నిద్రలో చెమటలు పడుతున్నాయంటే..ఓసారి ఆలోచించండి..టీబీ, గ్యాస్ సమస్యలు లేకున్నా చెమటలు వస్తున్నాయి అంటే..అసలు రీజన్ ఏంటో వైద్యులను సంప్రదించి అందుకు అనుగుణంగా టెస్టులు చేయిచుకుంటే..ప్రాబ్లమ్ ఏంటి అనేది తెలుస్తుంది. త్వరగా మేలుకుంటే..సమస్యను త్వరగా పరిష్కరించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version