తమ్మకాయలు పేరు వినే ఉంటారు.. కానీ వాటిని తినడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు.. పల్లెటూర్లలో దొరికే వీటని.. సిటీల్లో మార్కెట్లో కూడా అమ్ముతారు.. కానీ వీటి గురించి తెలియక మనం అసలు వాటిని పట్టించుకోం. వీటిని పెంచుకోవడం చాలా ఈజీ.. లేత తమ్మకాయలతో కర్రీ చేసుకుని తింటే.. బాడీకి చాలా మంచిదట. వీటి కాస్ట్ తక్కువ, ఫలితాలు ఎక్కువ. ఈరోజు మనం ఈ తమ్మకాయల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఏ రోగాలకు ఇది బాగా పనిచేస్తుందో చూద్దాం.
100 గ్రాముల తమ్మకాయలో ఉండే పోషకాలు..
శక్తి 60 కాలరీలు
పిండిపదార్థాలు 11 గ్రాములు
ప్రొటీన్ 5 గ్రాములు
కొవ్వు 0.4 గ్రాములు
ఫైబర్ 3 గ్రాములు
కాల్షియం 33 మిల్లీ గ్రాములు
విటమిన్ సీ 32 మిల్లీ గ్రాములు
ఇవి ప్రధానంగా తమ్మకాయల్లో ఉండే స్థూల, సూక్ష్మ పోషకాలు. వీటిని ఇతర కూరగాయల్లానే వంచుకోవచ్చు. పాలు పోసి చేసుకోవచ్చు, ఫ్రైలా వండుకోవచ్చు. రోటి పచ్చడికూడా చేసుకోవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. మలబద్ధకం సమస్యకూడా పోతుంది.
తమ్మకాయ వల్ల కలిగే లాభాలు..
తమ్మకాయల్లో రూటిన్( Rootine) అనే స్పెషల్ కెమికల్ ఉంటుంది. ఇది పెద్దప్రేగులో క్యాన్సర్ వచ్చిన తర్వాత..ప్యాచెస్ పడుతుంటాయి. వాటన్నింటిని తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఇందులో ఉండే బీటా అమైనో ప్రోపియోనైట్రైల్.. ( Beta Aminopropinitrile) అనే కెమికల్ స్త్రీలల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ లో కణజాలాన్ని డైరెక్టుగా నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది.
ఈ రెండు ఫలితాలు వస్తాయని 2006వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్( United States Department Of Agriculture) వారు పరిశోధన చేసి ఈ వివరాలు అందించారు. స్త్రీలల్లో అధికంగా వచ్చే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్.. ఇది రాకుండా రక్షించడానికి, వచ్చిన వారికి తగ్గించడానికి ఈ తమ్మకాయలు ఇలా మేలు చేస్తాయి.
ఇంకో బెనిఫిట్ ఏంటంటే..కొంతమందికి స్కిన్ డార్క్ అవుతుంది. అంటే ముందు కాస్త వైట్ గానే ఉంటారు కానీ.. రాను రానూ నల్లగా మారుతుంటారు. మెలనిన్ అనే నలుపు వర్ణం ఎక్కువ ఉత్పత్తి అవడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ మెకానిజంను అడ్డుకోవడానికి తమ్మకాయల్లో Tryptin Inhibitor అనే కెమికల్ ఉంటుంది. ఇది మెలనోసైట్స్ నలుపు వర్ణాన్ని ఎక్కువ ఉత్పత్తిచేయకుండా స్కిన్ ఫేయిర్ గా ఉండేలా చేస్తుంది. ఈ విషయాన్ని 2018లో కొరియా వారు పరిశోధనచేసి నిరూపించారు. స్కిన్ ఇది ఇలా మేలు చేస్తుంది. ఎండాకాలం చాలామందికి స్కిన్ నల్లగా అవుతుంది. ఈ టైంలో తింటే ఇంకా మంచిది.
ఇంకా తమ్మకాయలో L- dopa, Polyphenols అనే కెమికల్స్ ఉండటం వల్ల పార్కిన్సన్స్ డిసీస్.. చేతులు షివరింగ్ రావడం, సపోర్ట్ లేకుండా నడవలేకపోవడం, మాట వణికినట్లు రావడం జరుగుతుంది. ఇలాంటి వారికి.. నరం ఇరిటేషన్ తగ్గించి, నార్మల్ స్టేజ్ కి తీసుకొచ్చి, నరాలపట్టు పెంచేలా చేయడానికి తమ్మకాయలు ఇలా ఉపయోగపడుతున్నాయి.
లివర్ సెల్స్ ను హెల్తిగా ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సీ ఎక్కువగా ఉంది కాబట్టి..రోగనిరోధక శక్తికి బాగా మంచిది.
తమ్మకాయ గింజలు కూడా మార్కెట్లో అమ్ముతారు. రాజ్మా గింజలతో ఎలా వండుకుంటామో అలా ఈ గింజలను కూడా నానపెట్టి వండుకోవచ్చు. 100 గ్రాముల ఈ ఎండు తమ్మగింజల్లో 350 కాలరీల శక్తి ఉంటుంది. 24.5 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. కాబట్టి తమ్మకాయలు దొరకనప్పుడు ఇవి తీసుకోవచ్చు.
అన్ని సార్లు ఇష్టమైనవి, డైలీ తినేవే కాదు.. అప్పుడప్పుడు కొత్తవి కూడా ట్రే చేస్తూ ఉండాలి. అప్పుడే బాడీకీ కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. ఈ సారి తమ్మకాయలు కనిపిస్తే.. వదిలిపెట్టకండే..!
-Triveni Buskarowthu