వారానికి 150 నిమిషాలు ఇలా చేస్తే చాలు. ఫ్యాటీలివర్‌ సమస్య దూరం

-

బరువు తగ్గాలంటే.. కష్టపడటం ఒక్కటే మార్గం కాదు.. ఎంజాయ్‌ చేస్తూ కూడా క్యాలరీలను బర్న్‌ చేయొచ్చు. ఏరోబిక్ వ్యాయామంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫ్యాటీ లివర్‌ అనేది చిన్న సమస్య ఏం కాదు.. దీని వల్ల చాలా ప్రమాదం పొంచి ఉంటుంది. ఎలా అంటే.. ఇళ్లును రోజు క్లీన్‌ చేస్తుంటేనే అంతంతమాత్రం శుభ్రంగా ఉంటుంది. అలాంటిది.. రోజు పదిమంది తిరిగే ఇళ్లును అస్సలు క్లీన్‌ చేయకుండా నెలల తరబడి ఉంటే..అది ఎంత చెత్తగా ఉంటుందో.. మీ బాడీలో లివర్‌ పనిచేయకుండా పడకేస్తే లోపల అంతే చెత్త తయారు అవుతుంది. కాలేయం వాపు, కాలేయం దెబ్బతినడం లాంటివి జరుగుతుంది. కాలేయ పరిమాణాన్ని సాధారణీకరించడంలో ఏరోబిక్ వ్యాయామం సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

 

ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు వారానికి 150 నిమిషాలు అంటే మొత్తం రెండున్నర గంటల పాటు వ్యాయామం చేస్తే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. బర్పీస్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, శరీర బలం పెరుగుతుంది. శరీరం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. గుండె పరిస్థితి పెరుగుతుంది.

బట్ కిక్స్ ప్రారంభంలో చేయడం కష్టం. దానికి పదే పదే ప్రాక్టీస్ అవసరం. ఇది కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

డ్యాన్స్ ద్వారా సన్నబడతాం. సన్నబడితే ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది.

బరువు తగ్గడానికి గాడిద కిక్స్ ఏరోబిక్స్‌లో చాలా సహాయకారిగా ఉంటాయి. ఇలా రోజుకు 15-20 సార్లు చేయండి.

నడుము కొవ్వు తగ్గించడంలో ఫ్లట్టర్ కిక్స్ చాలా సహాయకారిగా ఉంటాయి. 18-20 సార్లు చేయండి.

మెరుగైన జీవక్రియ కూడా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వీటితో పాటు జాగింగ్, జంపింగ్ జాక్స్, స్కిప్పింగ్ స్టైర్ ట్రైనింగ్(మెట్లు ఎక్కి దిగడం చేయాలి), స్విమ్మింగ్ వంటివి కూడా చేస్తూ ఉండాలి. ఇవన్నీ బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. ఫ్యాటీ లివర్ తగ్గేందుకు ఏరోబిక్స్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఏరోబిక్స్ చేయడం వల్ల బరువు త్వరగా తగ్గుతుంది. దీని వల్ల మెటబాలిజం మెరుగవుతుంది. తద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు కొన్నింటిని తినకూడదు. అందులో మెయిన్‌గా ఆల్కహాల్, షుగర్, వేయించిన ఆహారం, వైట్ బ్రెడ్, పాస్తా, అధిక ఉప్పు ఆహారం (చిప్స్, ఊరగాయలు) తీసుకోవద్దు. కాలే, బీన్స్, చేపలు, ఓట్ మీల్, గింజలు, పసుపు, పొద్దుతిరుగుడు విత్తనాలు, వెల్లుల్లి వంటివి తినాలి.

ఫ్యాటీ లివర్ అనేది కాలేయ కణజాలంలో కొవ్వు పేరుకుపోయే పరిస్థితి. ఇది ఒకరకమైన వ్యాధి. ఇది కాలేయం వాపునకు దారితీస్తుంది. మద్యపానానికి దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువు తగ్గించుకోవడం చేయాలి. అంతేకాదు ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలా అయితేనే ఈ పరిస్థితి మారుతుంది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ఫ్యాటీ లివర్ ప్రారంభ దశను ఆలస్యంగా నిర్ధారణ చేస్తే కాలేయ ఫైబ్రోసిస్ లేదా సిర్రోసిస్ కు దారి తీసే అవకాశం ఉంది. ఇలాంటి దశ వస్తే కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సి వస్తుంది. అందుకే ముందు నుంచే జాగ్రత్తపడటం అవసరం.

Read more RELATED
Recommended to you

Exit mobile version