వానాకాలం అనగానే చల్లని వాతావరణం, పచ్చని ప్రకృతి మనకు ఎంతో ఆహ్లాదకరమైన పరిసరాలు గుర్తుకు వస్తాయి. అయితే ఈ వానాకాలం లో ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం మనం చూస్తుంటాం. జలుబు, జ్వరం వంటి సాధారణ సమస్యల నుండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేవారు ఉన్నారు. అయితే ఈ కాలంలో శ్వాసకోస సమస్యలు ఎదుర్కొనే వారికి సవాళ్లను తెస్తుంది. వానాకాలంలో శ్వాసకోశ సమస్యలు పెరగడానికి వాతావరణం మార్పులు, పరిశుభ్రత లేకపోవడం, ఇతర పర్యావరణ కారకాలు ప్రధాన కారణాలు. వానాకాలంలో ఈ సమస్యలు పెరగడానికి కారణాలు వాటి లక్షణాలు, నివారణ చర్యలను వివరంగా తెలుసుకుందాం..
శ్వాసకోశ సమస్యలు కు కారణాలు:వానాకాలంలో అధిక తేమ వలన ఇల్లు గోడలు ఇతర ప్రదేశాలు బూజు, శిలీంద్రాల పెరుగుదలకు దారితీస్తుంది. ఈ బూజు గాలిలో బ్యాక్టీరియాని విడుదల చేస్తుంది. ఇది ఊపిరితిత్తులలో చేరి ఎలర్జీలు, ఆస్తమా, శ్వాసకోస ఇన్ఫెక్షన్లను ప్రేరేపిస్తాయి. దీని వల్ల గురక, దగ్గు, శ్వాస ఆడక పోవడానికి కారణం అవుతుంది.
వానాకాలంలో చల్లని తడి వాతావరణం వైరస్ లు వ్యాప్తి చెందడానికి అనుకూలమైన పరిస్థితులుగా మారుతుంది. ఫ్లూ ఇతర వైరల్, శ్వాస కోసం ఇన్ఫెక్షన్లు ఈ సీజన్ లో ఎక్కువగా వస్తాయి. గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలకు దారితీస్తుంది. పిల్లలు, వృద్దులు ఈ ఇన్ఫెక్షన్ల కు గురిఅవుతారు.వానాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల గాలిలో కాలుష్య కణాలు శ్వాస కోసంలోకి సులభంగా చేరుతాయి. కలుషితనీరు గాలి వల్ల ఊపిరితిత్తుల సమస్య ఎక్కువవుతుంది. ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలను కలిగిస్తుంది.

శ్వాసకోశ సమస్య లక్షణాలు : వానాకాలంలో శ్వాసకోశ సమస్యలు కలిగిన వారు ఈ క్రింది లక్షణాలను గమనించవచ్చు.వాటిలో గురక,ఈల వంటి శబ్దం, దగ్గు, గొంతు నొప్పి,శ్వాస ఆడక పోవడం,జ్వరం, కండరాల నొప్పులు,చాతిలో బిగుతూ లేదా నొప్పి,గొంతు బొంగురు పోవడం,ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.
నివారణ చర్యలు: వానాకాలంలో శ్వాసకోస సమస్యలు తగ్గించడానికి ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం తేమను తగ్గించడం, మనం తాగే నీటిని కాచి చల్లార్చి తీసుకోవడం, స్వచ్ఛమైన నీటిని మాత్రమే తాగాలి. ఎక్కువమందిలోకి వెళ్ళినప్పుడు మాస్క్ ఉపయోగించడం లేదా కాలుష్య ప్రదేశాల్లో మాస్క్ ధరించడం ముఖ్యం. వేడి ఆహారం మాత్రమే తీసుకోవడం చేయాలి. చల్లనీటినీ, కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. ఫ్రిజ్లో నీ ఐటమ్స్ ని కొంతసేపు బయట ఉంచిన తర్వాత వాడడం ఉత్తమం. శ్వాసకోస సమస్య లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.
హోమ్ రెమెడీస్: ఒక టీ స్పూన్ తేనెలో అల్లం రసం కలిపి తీసుకోవడం దగ్గు, గొంతు నొప్పి తగ్గిస్తుంది. తులసి ఆకులతో చేసిన టీ, ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. అంతేకాక వేడి నీటితో ఆవిరి పీల్చడం కొంత ఉపశమనం కలిగిస్తుంది.
వానాకాలంలో అధిక తేమ, బూజు, వైరల్ ఇన్ఫెక్షన్లు, వాయు కాలుష్యం, దోమల ద్వారా వ్యాపించే రోగాలు శ్వాసకోశ సమస్యలను పెంచుతాయి ఈ సమస్యల నివారించడానికి పరిశుభ్రత పాటించడం, స్వచ్ఛమైన నీటిని తాగడం, సాత్విక ఆహారాన్ని తీసుకోవడం అవసరం. లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే వైద్య సలహా తీసుకోవడం ద్వారా శ్వాస కోసం నియంత్రించవచ్చు. ఈ జాగ్రత్తలతో వాన కాలాన్ని ఆరోగ్యంగా ఆనందంగా గడపండి.