టాలీవుడ్ యంగ్ హీరో కేరింత ఫేమ్ విశ్వంత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇతను తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. తన బ్యాచిలర్ లైఫ్ కు వీడ్కోలు చెబుతూ ఓ ఇంటివాడు అయ్యాడు. భావన అనే అమ్మాయితో కలిసి తన వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లుగా విశ్వంత్ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసుకున్నారు. తన వివాహానికి సంబంధించి ఎలాంటి ప్రకటన, హడావిడి లేకుండానే ఈ జంట మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.
ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎలాంటి హడావిడి, హంగామా లేకుండానే చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారని అంటున్నారు. కాగా… విశ్వంత్, భావన దంపతులకు సినీ సెలబ్రిటీలు, అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం విశ్వంత్ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. సినిమాలు మాత్రమే కాకుండా సిరీస్ లు కూడా చేస్తున్నారు.